పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే హెయిర్ స్పా చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

ఆరోగ్యమైన జుట్టు కోసం చాలా మంది ప్రతి నెల హెయిర్ స్పా ట్రీట్మెంట్( Hair spa treatment ) చేయించుకుంటూ ఉంటారు.

ఇందుకోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.

కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే హెయిర్ స్పా చేసుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.

మరి లేట్ చేయ‌కుండా ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక కలబంద ఆకును తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు మందారం ఆకులు( Hibiscus leaves ), మూడు మందారం పువ్వులు వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు( Aloe vera pieces ) కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ ఆముదం ( castor oil )వేసి స్పూన్ సహాయంతో అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి.

Advertisement

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని కొబ్బ‌రి నూనెను త‌లకు ప‌ట్టించి ప‌ది నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.మసాజ్ చేసుకున్న అనంత‌రం త‌యారు చేసి పెట్టుకున్న‌ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా గంటన్నర త‌ర్వాత మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.హెయిర్ స్పా వల్ల వచ్చే అన్ని బెనిఫిట్స్ ఈ రెమెడీ ద్వారా పొందొచ్చు.

వారానికి కేవ‌లం ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు సిల్కీగా, షైనీగా మెరుస్తుంది.

హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి.హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

చుండ్రు సమస్య దూరం అవుతుంది.స్కాల్ప్ హెల్తీగా హైడ్రేటెడ్ గా ఉంటుంది.

Advertisement

కురులు తరచూ పొడి బారకుండా ఉంటాయి.మరియు జుట్టు చిట్లడం, విరగడం వంటివి సైతం తగ్గుతాయి.

కాబట్టి వేలకు వేలు ఖర్చు పెట్టి హెయిర్ స్పా ట్రీట్మెంట్ చేయించుకోలేని వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.ఆరోగ్యమైన ఒత్తైన జుట్టును మీ సొంతం చేసుకోండి.

తాజా వార్తలు