నెలసరి క్రమం తప్పకుండా రావాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

ఇటీవల రోజుల్లో చాలామంది ఆడవారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో( Irregular Periods ) బాధపడుతున్నారు.

టైమ్ టు టైమ్ నెలసరి రాకపోవడం వల్ల ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తున్నారు.

నెలసరి సక్రమంగా రావడానికి మందులు వాడుతున్నారు.అయితే మందులతో సంబంధం లేకుండా కొన్ని కొన్ని చిట్కాల ద్వారా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.దాల్చిన చెక్క( Cinnamon ) నెలసరి సమస్యలను దూరం చేయడంలో అద్భుతంగా తోడ్పడుతుంది.

నైట్ నిద్రంచ‌డానికి ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో( Warm Milk ) పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవాలి.ఈ విధంగా చేస్తే నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది.

Advertisement

నిద్ర కూడా బాగా ప‌డుతుంది.

అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి ఉల్లితో( Onion ) చెక్ పెట్టవచ్చు.ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని తొక్క తొల‌గించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆపై ఒక గ్లాస్ వాటర్ లో ఉల్లిపాయ ముక్కలను పదినిమిషాల పాటు మరిగించి వడకట్టాలి.

ఈ ఉల్లి వాటర్ లో వన్ టీ స్పూన్ బెల్లం పొడి కలిపి సేవించాలి.వారానికి ఒకసారి ఈ డ్రింక్ తీసుకుంటే నెలసరి సరైన సమయానికి వస్తుంది.

మెంతి ఆకు ఆడవారికి వరం అనే చెప్పుకోవచ్చు.వారానికి కనీసం మూడు సార్లు మెంతి ఆకును కూరగా చేసుకుని తింటే పీరియడ్స్ టైమ్ టు టైమ్ వస్తాయి.అలాగే కొందరికి నెలసరి సమయంలో అధిక రక్తస్రావం జరుగుతుంటుంది.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

అలాంటివారు నెలసరిలో నాలుగు రోజులు నిమ్మరసం తీసుకోవాలి నిమ్మరసం అధిక రక్తస్రావం సమస్యకు అడ్డుకట్ట వేస్తుంది.ఇక నెలసరి నొప్పుల నుంచి విముక్తి పొందాలి అనుకునే వారికి అల్లం తోడ్పడుతుంది.

Advertisement

ఒక గ్లాస్ వాటర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుమును మరిగించి వడకట్టాలి.ఈ వాటర్ లో తేనె కలిపి తీసుకుంటే నెలసరి నొప్పులు పరార్ అవుతాయి.

తాజా వార్తలు