హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు.. ఈ నియమాలు పాటించండి..!

శ్రీరాముడికి పరమ భక్తుడు అయిన ఆంజనేయ స్వామి హిందూమతంలో అతి శక్తివంతమైన వ్యక్తి.అయితే ఆయన భక్తికి, బలానికి, అచంచలమైన విధేయతకు ప్రతిరూపం.

శ్రీరాముని పట్ల ఆయనకున్న భక్తి ఎలాంటిది అంటే సంజీవని మొక్క కోసం ఏకంగా పర్వతం తీసుకువస్తారు.అంజనిపుత్రుడు, హనుమంతుడు, ఆంజనేయుడు అంటూ ఆయనకు ఎన్నో రకాల పేర్లు కూడా ఉన్నాయి.

అంకితభావానికి, విధేయతకు చక్కని ఉదాహరణహనుమంతుడు.తిరుగులేని రామభక్తి హనుమంతుడిని దేవుడిని చేసింది.

అయితే ఆంజనేయుడిని ఆరాధించడం వలన సాధించలేని ఎన్నో పనులు సులభంగా పూర్తి చేసుకోగల శక్తి లభిస్తుంది.అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

Advertisement

జీవితంలోని అన్ని అడ్డంకులన్నీ అధిగమించి, విజయం సాధించడం కోసం హనుమంతుడి ఆశీస్సులు భక్తులు కోరుకుంటారు.భయం అనిపించినప్పుడు, దుష్టశక్తుల్ని తరిమికొట్టాలి అనుకున్నప్పుడు, హనుమాన్ చాలీసా పఠిస్తారు.

హనుమంతుడు భక్తులకి చాలా దగ్గరగా ఉంటాడు.అందుకే భక్తుల విన్నపాలు చాలా త్వరగా ఆయనకి చేరుకుంటాయి.

హనుమంతుని ఆశీర్వాదం పొందేందుకు చాలా మంది హనుమాన్ చాలీసా పఠించడం ఒక మార్గం అని చెబుతారు.హనుమాన్ చాలీసాని 108 సార్లు అత్యంత ఏకాగ్రతతో, భక్తిశ్రద్ధలతో పఠించడం వలన అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.మంగళవారంనాడు శుభ్రంగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించాలి.ముందుగా గణపతి పూజ చేసి, ఆ తర్వాత సీతారాములని పూజించాలి.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 1, మంగళవారం 2024

తర్వాత హనుమాన్ కు నమస్కరించి హనుమాన్ చాలీసా పఠించాలి.కుశాసనం మీద కూర్చొని హనుమాన్ చాలీసా చదవాలి.

Advertisement

ఇక చాలీసా పఠించడం వలన అనారోగ్య సమస్యలు, కష్టాలు, శ్రమలు తొలగిపోతాయి.హనుమాన్ చాలీసా చదవాలని అనుకుంటే మద్యపానం, ధూమపానం లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.

మాంసాహారం అస్సలు తీసుకోకూడదు.పిల్లలు హనుమాన్ చాలీసా పఠిస్తే జ్ఞానవంతులుగా ఎదుగుతారని నమ్మకం.

తాజా వార్తలు