Nandyala : నంద్యాల జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి

నంద్యాల( Nandyala ) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.అదుపుతప్పిన ఓ కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని తెలుస్తోంది.

Five People Died In Road Accident In Nandyala District-Nandyala : నంద్�

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు.

Advertisement
Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్

తాజా వార్తలు