ఐపీఎల్ సీజన్ -16 మరికాసేపట్లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ ( Chennai Super Kings - Gujarat Titans )మధ్య తొలి మ్యాచ్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
కరోనా కారణంగా దాదాపుగా మూడేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో ఈ సీజన్ అట్టహాసంగా జరుగనుంది.
ఈ సీజన్లో 10 జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.క్రికెట్ లో కొన్ని సమస్యలకు శాశ్వతంగా పెట్టడం కోసం ఈ ఐపీఎల్ లో ఐదు సరికొత్త రూల్స్ పెట్టడం జరిగింది.ఈ రూల్స్ తో కొన్ని సమస్యలకు పెట్టొచ్చు అవేంటో చూద్దాం.1.టాస్ తరువాత జట్ల ప్రకటన: ఇంతవరకు టాస్ వేయకముందే తమ తుది జట్టుకు సంబంధించిన షీట్లను మ్యాచ్ రిఫరీ కి అందించేవారు.ప్రస్తుతం ఈ నిబంధనలో కాస్త మార్పు చేసి టాస్ వేసిన తర్వాత తమ తుది జట్లను ప్రకటించే అవకాశం కల్పించబడింది.
2.ఇంపాక్ట్ ప్లేయర్: ఇంపాక్ట్ ప్లేయర్ అంటే పరిస్థితులను బట్టి 12వ ఆటగాడిని కూడా ఆడించే అవకాశం కల్పించడం.ఈ 12వ ఆటగాడు కెప్టెన్ గా ఉండడానికి అవకాశం లేదు.
కేవలం బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ ల కోసం ఉపయోగించుకోవచ్చు.జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉంటే, 12వ ఆటగాడిగా మరో విదేశీ ప్లేయర్ ను తీసుకోకుండా తప్పకుండా ఇండియన్ ఆటగాడినే తీసుకోవాలి.
3.వైడ్, నోబాల్స్ కు డీఆర్ఎస్: క్రికెట్ లో ఎప్పుడు వైట్ బాల్స్, నో బాల్స్ విషయంలో వివాదాలు తలెత్తడం సహజం.కానీ వీటి శాశ్వత పరిష్కారం కోసం ఆటగాళ్లు అనుమానం ఉంటే వైడ్, నోబాల్స్ విషయంలో డీఆర్ఎస్ కోరవచ్చు.4.వికెట్ కీపర్ పైనా వేటు: బ్యాటర్ బంతిని కొట్టక ముందే వికెట్ కీపర్ కదిలితే అతనిపై అనుచిత కదలిక జరిమానా విధించబడుతుంది.5.స్లో ఓవర్ రేటుకు జరిమానా: ఈ ఐపీఎల్( IPL ) లో 90 నిమిషాలలో 20 ఓవర్లు పూర్తి చేయాల్సిందే.ఒకవేళ నిర్ణీత సమయంలో 20 ఓవర్లు పూర్తి చేయకుంటే ఆ తర్వాత ప్రతి ఓవర్ కు 30 యార్డ్ సర్కిల్ లోపల అదనపు ఆటగాడిని ఉంచాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy