Kattedan Fire Accident : రాజేంద్రనగర్ కాటేదాన్ లో అగ్నిప్రమాదం.. అదుపులోకి రాని మంటలు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని కాటేదాన్( Rajendra Nagar Kattedan ) లో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు.

తెల్లవారుజాము నుంచి బిస్కెట్ కంపెనీలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.

బిల్డింగ్ మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు మూడో అంతస్తుకు చేరుకున్నాయి.దీంతో మంటల ధాటికి భవనం పడిపోయే స్థితికి వచ్చిందని తెలుస్తోంది.

మంటలు భారీగా( Fire Accident ) ఎగిసిపడుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న కంపెనీల సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.కాగా ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు
Advertisement