సూర్యాపేట జిల్లాలో ప్రైవేట్ బస్సులో మంటలు..తప్పిన ప్రాణనష్టం

సూర్యాపేట జిల్లాలో ప్రమాదం జరిగింది.మిర్యాలగూడ సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు మంటల ధాటికి పూర్తిగా దగ్ధమైంది.అయితే ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సులో సుమారు 26 మంది ప్రయాణికులు ఉన్నారు.

సకాలంలో మంటలను గుర్తించి కిందకు దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది.దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
సోమవారం రోజు ఈ మంత్రాలను పఠించడం వల్ల.. నయం కానీ రోగాల తో పాటు ఇంకెన్నో సమస్యలు దూరం..!

తాజా వార్తలు