మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సహాయం

నిస్సహస్థితికి చేరిన మహిళలకు మెరుగైన వైద్యం కోసం చందుర్తి మండల కేంద్రానికి చెందిన పిట్టల మంజుల కు ఆర్థిక సహయం చేసి మానవత్వం చాటించారు.

పుట్టిన గడ్డపై మమకారం.

ఆపదస్తే ఆదుకునే మనస్తత్వం.మంచి మనసున్న మారాజు మండల కేంద్రానికి చెందిన దారం సతీష్ (ఎన్ ఆర్ ఐ )(Sathish) మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు మంజుల(Manjula) మెరుగైన వైద్యానికి తన వంతుగా 10 వేల రూపాయలు తన తండ్రి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు మంజుల ఇటీవల బిల్డింగ్ పై నుండి ప్రమాదవశాత్తు పడి తీవ్ర గాయాలపాలై రెండు కాళ్లు విరిగి మంచానికే పరిమితం కాగా మెరుగైన వైద్యం కోసం ఆర్థిక స్తోమత బాగా లేదన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని మంజుల వైద్యం ఖర్చులకోసం తమ వంతుగా రూ.10 వేలు బాధిత కుటుంబానికి మంగళవారం అందజేశారు.మంచి మనసుతో మానవత్వంతో ముందుకు వచ్చి తమ వంతుగా సహాయం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

మహిళ ఆరోగ్యం కోసం దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని కుటుంబీకులు కోరుతున్నారు.

గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...
Advertisement

Latest Rajanna Sircilla News