ఆఖరికి అమెజాన్‌లో వున్న ఆ చెట్టును శాస్త్రవేత్తలు కనిపెట్టారు... దాని విశేషం ఇదే!

ఆ చెట్టు కోసం ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశ్రమిస్తున్నారు.ఆఖరికి ఆ చెట్టు ఉనికిని తెలుసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, బ్రెజిలియన్ బ్రిటిష్ పరిశోధకుల బృందం 2019లో 3డీ మ్యాపింగ్ అధ్యయనంలో భాగంగా ఉపగ్రహ చిత్రాల్లో ఓ అత్యంత ఎత్తైన చెట్టును ఒకదానిని కనుగొనటం జరిగింది.దాంతో వారికీ ఆ చెట్టు మీద ఆసక్తి కలిగింది.

అప్పటినుండి ఎలాగైనా ఆ చెట్టు దగ్గరకు వెళ్లాలని, దాని గురించి వివరాలు సేకరించాలని అనుకున్నారు.ఈ క్రమంలో అక్కడకు భౌతికంగా వెళ్లి, ఆ చెట్టును చూసి తీరాలని పరిశోధకులు అనుకున్నారు.

అయితే తాజాగా వారు అనుకున్నది సాధించారు.ఆ చెట్టు అమెజాన్‌ రెయిన్‌ ఫారెస్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు.

Advertisement

ఇక ఆ చెట్టు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నందున ఆ భారీ వృక్షాన్ని చేరుకోవడానికి వారికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టిందని, అంటే మూడేళ్ల ప్రణాళిక, 5 యాత్రలు, 2 వారాల పాటు ట్రెక్కింగ్ చేసి మరీ అక్కడికి చేరుకున్నామని తెలిపారు.అవును, ఈ ఏడాది సెప్టెంబర్ 17న శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ఆ అమెజాన్ దిగ్గజాన్ని చేరుకోగలిగారు.

శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు ప్రకారం, ఆ చెట్టు 9.9 మీటర్లు అంటే 32 అడుగులు, చుట్టుకొలత 88.5 మీటర్లు అంటే 290 అడుగులు పొడవు కలిగి వుంది.అంటే మీరు ఊహించుకోండి.

ఈ చెట్టు అమెజాన్‌లో కనుగొనబడిన అతిపెద్ద చెట్టు కావడం విశేషం.ఏంజెలిమ్-వెర్మెల్హో అని కూడా పిలువబడే డినిజియా ఎక్సెల్సా చెట్టు 30-అంతస్తుల ఆకాశాన్ని కమ్మే విధంగా ఉంటుంది.

ఇది 400 ఏళ్ల నాటి పురాతనమైన చెట్టుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.ఇలాంటి చెట్లను పర్యవేక్షించడం, దానిలో దాగున్న ప్రత్యేక లక్షణాలు, జరిగే పర్యావరణ ప్రక్రియలపై అ‍ధ్యయనం చేయనున్నట్లు శాస్తవేత్తల బృందం వెల్లడించింది.

పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు