ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ కి మద్దతు గా నిలుస్తున్న సినీ సెలబ్రిటీస్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ).

ఈయన గురించి మనం ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.

ఇక ప్రస్తుతం ఎలక్షన్స్ సీజన్ నడుస్తున్న సందర్భంగా ఆయన ప్రచారంలో పాల్గొంటూ ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఆయన పిఠాపురం నియోజకవర్గం ( Pithapuram Constituency )నుంచి ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈనెల 13వ తేదీన జరగబోయే ఎన్నికల కోసం ఆయన ఇప్పటికే చాలా కసరత్తులను కూడా చేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే సినీ సెలబ్రిటీల నుంచి ఆయనకు భారీ ఎత్తున మద్దతు లభిస్తుంది.ఇక అందులో భాగంగానే ఇప్పటికే మెగా ఫ్యామిలీ లో ఉన్న హీరోలతోపాటు బయట హీరోలు కూడా ఆయనకు మద్దతు ఇవ్వడం మనం చూసాము.ఇక మొత్తానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గెలుపు ఒకటే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు.

Advertisement

ఇక నాని, తేజ సజ్జ, రాజ్ తరుణ్ ( Nani, Teja Sajja, Raj Tarun )లాంటి స్టార్ హీరోలందరూ తనకు మద్దతు పలికారు.ఇక ఇప్పటికే రామ్ చరణ్ చిరంజీవి లాంటి వారు కూడా ఆయన కోసం ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నారు.

ఇక అల్లు అర్జున్ కూడా తన మద్దతు పవన్ కళ్యాణ్ కి అంటూ ఒక పోస్ట్ కూడా చేశాడు.ఇక రీసెంట్ గా శ్రీయ రెడ్డి కూడా తనకు మద్దతు తెలిపింది.

సలార్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రేయ రెడ్డి పవన్ కళ్యాణ్ కి ఓటు వేసి గెలిపించండి మీ భవిష్యత్తును మార్చుకోండి అంటూ ఒక పోస్ట్ చేయడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇక మొత్తానికైతే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం అనే చెప్పాలి.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు