బెండ పంటలో ఎరువుల యాజమాన్యం.. కలుపు నివారణ కోసం చర్యలు..!

బెండ పంటను( Okra Crop ) ఏడాది పొడవునా ఏ కాలంలో ఉన్న సాగు చేయవచ్చు.వేడి వాతావరణంలో అయితే అధిక దిగుబడులు పొందవచ్చు.

కాబట్టి రైతులు వేసవికాలంలో ( Summer Season ) బెండ పంటను సాగు చేయడానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు.కాకపోతే వేరే కాలాలలో పంట విస్తీర్ణం తక్కువగా ఉండడంతో మార్కెట్లో మంచి ధర ఉంటుంది.

కాబట్టి పంటను ఒకేసారి కాకుండా దఫలు దఫలుగా నాటుకొని సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చు.బెండ పంట వేసే పొలంలో ఆఖరి దుక్కిలో పది టన్నుల పశువుల ఎరువు,( Cattle Manure ) 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేసి కలియ దున్నాలి.

ఆ తర్వాత రెండు లేదా మూడుసార్లు దున్ని పొలాన్ని దమ్ము చేసుకోవాలి.

Fertilizers Management In Okra Crop Actions For Weed Prevention Details, Fertili
Advertisement
Fertilizers Management In Okra Crop Actions For Weed Prevention Details, Fertili

ఒక ఎకరాకు 3.5 కిలోల విత్తనాలు అవసరం.విత్తనాలను ముందుగా విత్తన శుద్ధి( Seed Purification ) చేసుకోవాలి.

ఒక కిలో విత్తనాలను నాలుగు గ్రాముల ట్రైకోడెర్మావిరిడి తో విత్తన శుద్ధి చేసుకోవాలి.ఇక మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.

పంట 30, 40 రోజుల దశలో ఉన్నప్పుడు ఒక ఎకరాకు 30 కిలోల యూరియాను రెండు దఫలుగా అందించాలి.

Fertilizers Management In Okra Crop Actions For Weed Prevention Details, Fertili

పంట పూత దశలో ఉన్నప్పుడు ఒక లీటరు నీటిలో 5గ్రాముల సూక్ష్మదాతు, ఐదు గ్రాముల 19:19:19 ను కలిపి పిచికారి చేస్తే పూత బలంగా ఉంటుంది.బెండను బోధన పద్ధతిలో విత్తుకొని, డ్రిప్ విధానం ద్వారా నీటిని అందిస్తే కలుపు సమస్య దాదాపుగా లేనట్టే.బెండ విత్తనం నాటిన 24 గంటల లోపు మూడు మిల్లీ లీటర్ల పెండిమిథాలిన్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

పంట 30 రోజుల దశలో ఉన్నప్పుడు గురు లేదా గుంటికతో అంతర కృషి చేయాలి.దీంతో పొలంలో కలుపు సమస్య( Weed ) ఉండదు.కలుపు సమస్య లేకపోతే వివిధ రకాల చీడపీడలు పంటను ఆశించే అవకాశం ఉండదు.

Advertisement

దీంతో ఆశించిన స్థాయిలో పంట దిగుబడి సాధించవచ్చు.

తాజా వార్తలు