Sesame Crop : నువ్వుల పంటలో ఎరువుల యజమాన్యం.. అధిక దిగుబడికి మేలు రకం విత్తనాలు ఇవే..!

ప్రధాన నూనె గింజ పంటలలో నువ్వుల పంట( Sesame Crop ) కూడా ఒకటి.

ఖరీఫ్ పంటలు ఆలస్యంగా నాటుకునే పరిస్థితులు వస్తే జనవరి, ఫిబ్రవరి నెలలో నువ్వుల పంటను విత్తుకొని అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికరలాభాన్ని పొందవచ్చు.

వేసవిలో నువ్వుల పంటను సాగు చేస్తే చీడపీడల బెడద( Pests ) కాస్త తక్కువగా ఉంటుంది.దీంతో పంట విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడి పొందవచ్చు.

నీరు నిల్వ ఉండని నల్లరేగడి నేలలు, తేలిక నేలలు నువ్వుల పంట సాగుకు( Sesame Farming ) చాలా అనుకూలంగా ఉంటాయి.ఒక ఎకరం పొలానికి 2.5 కిలోల విత్తనాలు అవసరం.విత్తనాలను( Seeds ) ఇసుకతో కలిపి గొర్రుతో విత్తాలి.

ఒక కిలో విత్తనాలను మూడు గ్రాముల థైరంతో విత్తన శుద్ధి చేసుకోవాలి.విత్తనాన్ని రెండు లేదా మూడు సెంటీమీటర్ల కన్నా ఎక్కువ లోతులో విత్తకూడదు.

Advertisement
Fertilizers In Sesame Crop Best Types Of Seeds For High Yield Details-Sesame Cr

నువ్వుల పంటకు అందించాల్సిన పోషక ఎరువుల విషయానికి వస్తే.

Fertilizers In Sesame Crop Best Types Of Seeds For High Yield Details

ఖరీఫ్ లో నువ్వుల పంటను సాగు చేస్తే, ఒక ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు,( Cattle Manure ) 15 కిలోల నత్రజని, 15 కిలోల పోటాష్, 25 కిలోల బాస్వరం ఎరువులు వేయాలి.రబీ లేదా వేసవికాలంలో నువ్వుల పంటను సాగు చేస్తే.ఈ ఎరువులతో పాటు అదనంగా 8 కేజీల నత్రజని ఎరువు వేయాలి.

ఈ ఎరువులను మొత్తం ఒకేసారి కాకుండా నత్రజని రెండు సమభాగాలుగా చేసుకుని ఆఖరి దుక్కిలో ఒకసారి, విత్తనం విత్తిన నెల రోజులకు ఒకసారి వేయాలి.

Fertilizers In Sesame Crop Best Types Of Seeds For High Yield Details

అధిక దిగుబడులు ఇచ్చే మేలు రకం విత్తనాల విషయానికొస్తే.ఖరీఫ్ లో సాగు చేయాలనుకుంటే.ఖరీఫ్ లో( Kharif ) అయితే గౌరి, మాధవి, ఎలమంచిలి-11, ఎలమంచిలి-66 రకాలలో ఏదో ఒకటి సాగు చేయాలి.

రబీ లేదా వేసవికాలంలో నువ్వుల పంట సాగు చేయాలంటే.హిమ( జె.సి యాన్ 9426), చందన, రాజేశ్వరి, శ్వేతాతిల్ రకాలలో ఏదో ఒక రకం సాగు చేస్తే ఆశించిన స్థాయిలో అధిక దిగుబడును పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు