ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. బిడ్డను ఎలా చంపగలను? అంటూ తండ్రి సూసైడ్..!

ఈ మధ్య కాలంలో పిల్లలు తమ ఇష్టానుసారం ప్రేమ పెళ్లిళ్లకు( Love Marriage ) మొగ్గుచూపుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.

ముఖ్యంగా ఇంటర్‌కాస్ట్ వివాహాలు( Inter-Caste Marriage ) ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అయితే, ఇవి కొన్ని కుటుంబాల్లో తీవ్ర సంక్షోభానికి దారితీస్తున్నాయి.పిల్లలు తమ ఇష్టాన్ని అవలంబిస్తూ పెళ్లి చేసుకుంటే, ఆ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు అంగీకరించకపోవడం వల్ల గాఢమైన భావోద్వేగాలు, బలహీనతలు దారుణ సంఘటనలకు దారితీస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న తాజా సంఘటన అలాంటి సంఘటనలకే నిదర్శనం.మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో( Gwalior ) 49 ఏళ్ల మెడికల్ స్టోర్ యజమాని రిషిరాజ్ అలియాస్ సంజూ జైస్వాల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

బుధవారం రాత్రి, తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు.ఇది కుటుంబాన్ని, సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

Advertisement

రిషిరాజ్( Rishiraj ) కుమార్తె, 15 రోజుల క్రితం పొరుగున ఉన్న వేరే వర్గానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది.ఆమె ఇంటినుండి వెళ్లిపోయి ఇండోర్‌లో దొరకడంతో కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి తీసుకువచ్చారు.

కోర్టు విచారణలో ఆమె తన వివాహం చట్టబద్ధమని, భర్తతో కలిసి ఉండాలనుకుంటున్నట్లు పేర్కొంది.

కూతురి నిర్ణయంతో మనోవేదనకు గురైన రిషిరాజ్, తన జీవితానికి తెరదించుకున్నాడు.మరణానికి ముందు తన కుమార్తె ఆధార్ కార్డ్ ప్రింట్‌పై సూసైడ్ నోట్ రాశాడు.“హర్షితా నువ్వు తప్పు చేశావు, నేను వెళ్లిపోతున్నాను.

నేను మీ ఇద్దరిని చంపి ఉండేవాడిని.కానీ నా కూతురిని ఎలా చంపగలను.? నువ్వు ఒక కూతురిగా చేసిన పని సరైంది కాదు” అని ఆవేదన వ్యక్తం చేశాడు.అతడు కుటుంబాన్ని విడదీసిన లాయర్‌పై కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచాడు.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
పైసా ఖర్చు లేకుండా ముఖంపై మచ్చలను పోగొట్టుకోవాలనుకుంటే ఇలా చేయండి!

“అతనికి కుమార్తెలు లేరా.? తండ్రి బాధ తెలియదా.? మేము సమాజంలో ఇక ముఖం చూపించలేం, మా కుటుంబం మొత్తం నాశనం అయింది” అని బాధతో లేఖను రాశాడు.

Advertisement

సూసైడ్ నోట్‌లో రిషిరాజ్ చట్ట ప్రక్రియను కూడా ప్రశ్నించాడు.ఇందులో అతను “ఆర్యసమాజ్ కింద వివాహం చెల్లకపోతే, కోర్టు ఎలా ఆమెను తన భాగస్వామితో వెళ్లేందుకు అనుమతించింది? నా బాధను ఎవరూ అర్థం చేసుకోలేదు” అంటూ మనోవేదనను వ్యక్తం చేశాడు.ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి.

పెళ్లి చేసుకున్న యువకుడి తండ్రిపై రిషిరాజ్ బంధువులు దాడి చేసినట్టు సమాచారం.

తాజా వార్తలు