కొడుకును గుంజీలు తీయించాడని టీచర్‌ని చితకబాదిన తండ్రి... షాకింగ్ వీడియో వైరల్...

సాధారణంగా ఉపాధ్యాయులు పిల్లలను క్రమశిక్షణలో పెట్టేందుకు చిన్నపాటి పనిష్మెంట్స్ ఇస్తుంటారు.అయితే కొందరు పిల్లలు మాత్రం అలాంటి శిక్ష తమకు విధించినందుకు టీచర్లపై పగబడుతుంటారు.

టీచర్లు కొట్టినట్లు తల్లిదండ్రులకు వెళ్లి చెబుతుంటారు.అర్థం చేసుకునే తల్లిదండ్రులైతే ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తారు.

టీచర్లు మరీ దారుణంగా కొడితే మాత్రం వారికి దేహశుద్ధి తప్పదు.అయితే ఇటీవల కేవలం గుంజీలు తీయించినందుకే ఒక ఉపాధ్యాయుడిని స్టూడెంట్ తండ్రి విచక్షణ రహితంగా కొట్టాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.అందులో దృశ్యాలు చూసి చాలామంది షాక్ అవుతున్నారు.

Father Crushes Teacher For Picking Sons Keys Shocking Video Goes Vira , Utta
Advertisement
Father Crushes Teacher For Picking Son's Keys Shocking Video Goes Vira , Utta

ఈ తండ్రి సౌత్ సిటీ మోడల్( City Model School ) అనే ప్రైవేట్ స్కూలు టీచర్ పై దాడి చేసినట్టు తెలిసింది.టీచర్ తనని గుంజీలు తీయించాడని కొడుకు చెప్పడంతో సదరు తండ్రి కోపంతో ఊగిపోయాడు.అనంతరం తన స్నేహితులతో కలిసి పాఠశాలకు వచ్చాడు.

టీచర్ ప్రిన్సిపాల్ రూమ్‌లో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్లి అతనిపై దాడి చేయడం మొదలుపెట్టాడు.చెంపలు పగలకొడుతూ, తన్నుతూ, ఇష్టం వచ్చినట్లు గుద్దుతూ అతడు రెచ్చిపోయాడు.

ఇదంతా చూస్తున్న ప్రిన్సిపల్ ఒక్కసారిగా షాక్ అయింది."ఆగండి" అని ఆమె ఎంత అరిచినా సదరు తండ్రి మాత్రం అలానే దాడి చేశాడు.

చివరికి సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆపేంత వరకు అతను ఆగలేదు.

Father Crushes Teacher For Picking Sons Keys Shocking Video Goes Vira , Utta
చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
వైరల్ వీడియో : సీక్రెట్‌గా ప్రియురాలితో హొలీ ఆడాలని చూసిన ప్రియుడు.. చివరకు?

స్టూడెంట్ ఫాదర్( Father ) దాడికి సంబంధించిన విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరిపి, అనంతరం సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు.ఇరువైపుల నుంచి ఫిర్యాదు అందకపోవడంతో ఎవరినీ అరెస్టు చేయలేదు.

Advertisement

ఫిర్యాదు నమోదు కాగానే తాము యాక్షన్ తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

తాజా వార్తలు