కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మాండ్యా జిల్లాలో అదుపుతప్పిన ఓ కారు ప్రమాదవశాత్తు కెనాల్ లో పడింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృత్యువాతపడ్డారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ మృతదేహాలను వెలికితీశారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతులు కర్ణాటకలోని తుమకూరు జిల్లా తిప్తూరు వాసులుగా గుర్తించారు.మైసూరులో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement