ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ మారుతున్నాయి.. వీటిని అప్డేట్ చేసారా?

దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, టోల్ వసూలును క్రమబద్ధీకరించేందుకు ఫాస్ట్ ట్యాగ్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

కానీ ఇప్పటికీ ఫాస్ట్ ట్యాగ్ విషయంలో ఎప్పటికప్పుడు చాలా మార్పులు చూస్తున్నాం.

ఫాస్ట్ ట్యాగ్ KYCని పేర్కొన్న వ్యవధిలోగా అప్‌డేట్ చేయకపోతే, సంబంధిత ఫాస్ట్ ట్యాగ్ (FAST TAG) ఖాతాలు డీయాక్టివేట్ చేయబడతాయని గుర్తుంచుకోవాలి.కాబట్టి, వినియోగదారులు వెంటనే ఫాస్టాగ్ KYCని అప్‌డేట్ చేయాలి.

కొత్త నిబంధనల ప్రకారం, ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసిన 90 రోజులలోపు తమ వాహన లైసెన్స్ ప్లేట్ తమ ఫాస్ట్ ట్యాగ్ ఖాతాకు లింక్ చేసారో లేదో చూసుకోవాలి.ఇలా వినియోగదారులు మొదటి 90 రోజులలోపు వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను అప్‌డేట్(Update registration number) చేయకుంటే, వారికి అదనంగా 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఇవ్వబడుతుంది.

అయితే, ఈ గడువును చేరుకోవడంలో విఫలమైతే మీరు బ్లాక్‌లిస్ట్ లో చేర్చబడతారు.దాంతో దీన్ని ఉపయోగించకుండా నిషేధించబడతారు.

Fastag Rules Are Changing Have They Be Updated ,fastag, New Rules, Update Fasta
Advertisement
Fastag Rules Are Changing Have They Be Updated? ,Fastag, New Rules, Update Fasta

మూడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం ఉండి ఉన్న ఫాస్ట్ ట్యాగ్‌ల కోసం సరఫరాదారులు తప్పనిసరిగా KYC ధృవీకరణను పొందాలి.దాంతో ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్లకు నవంబర్ 1 నుండి నవంబర్ 31 వరకు సమయం వచ్చింది.ఫాస్ట్ ట్యాగ్ సర్వీస్ ప్రొవైడర్లు నవంబర్ 1 నుండి తప్పనిసరిగా కొన్ని అనుసరించాల్సినవి పనులేంటంటే.

ఐదేళ్ల వ్యవధిని చేరుకున్న ఫాస్టాగ్‌లు ప్రస్తుత ప్రమాణాలకు అనుగుణంగా, వాటి కార్యాచరణను నిర్ధారించడానికి తప్పనిసరిగా భర్తీ చేయాల్సి ఉంటుంది.కొత్త కారు యజమానులందరూ కొనుగోలు చేసిన 90 రోజులలోపు వారి వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను వారి ఫాస్ట్ ట్యాగ్ ఖాతాకు తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి.

Fastag Rules Are Changing Have They Be Updated ,fastag, New Rules, Update Fasta

ప్రతి వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, చాసిస్ నెంబర్ తప్పనిసరిగా ఫాస్టాగ్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా అప్డేట్ చేసుకోవాలి.సులభమైన ధృవీకరణ, యాప్ నోటిఫికేషన్‌లు, హెచ్చరికలను ప్రారంభించడానికి యజమాని మొబైల్ నంబర్‌ను ఫాస్టా ట్యాగ్‌తో లింక్ చేయడం తప్పనిసరి.KYC ధృవీకరణ ప్రక్రియను సులభతరం చేయడానికి, సర్వీస్ ప్రొవైడర్లు యాప్‌లు, వాట్సాప్, వెబ్ పోర్టల్‌లతో సహా వారి సమాచారాన్ని అప్డేట్ చేసుకోవడానికి వినియోగదారులకు అనేక ఎంపికలను అందించాలని భావిస్తున్నారు.

మొత్తానికి KYC ప్రక్రియను పూర్తి చేయడానికి ఫాస్టాగ్ కంపెనీలకు నవంబర్ 31, 2024 వరకు గడువు ఇవ్వబడింది.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు