ఫాంటా గుట్టు రట్టు.. ఇండియాలో కల్తీనా? ఇతర దేశాల్లో ఒకలా.. ఇక్కడ ఒకలా?

సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది.అదేంటంటే చాలామంది ఫేవరెట్ ఫాంటా డ్రింక్ గురించిన షాకింగ్ నిజం.

లింక్డ్‌ఇన్‌లో ఒక యూజర్ షేర్ చేసిన పోస్ట్ ప్రకారం, ఇండియాలో(Indian) మనం తాగే ఫాంటాకి, ఇతర దేశాల్లో అమ్మే ఫాంటాకి మధ్య చాలా తేడా ఉందంట.ఆ యూజర్ మలేషియా నుంచి తెచ్చిన ఫాంటా డ్రింక్ కొన్నారు.

దాన్ని చూడగానే ఇండియన్ ఫాంటా అనుకున్నారు కానీ రేటు చూసి షాక్ అయ్యారు.ఇండియన్ ఫాంటా రూ.40లు ఉంటే, ఇది ఏకంగా 140 రూపాయలు.ఇంత రేటు ఎందుకా అని న్యూట్రిషన్ లేబుల్ (Nutrition label)చూస్తే అసలు ట్విస్ట్ బయటపడింది.మలేషియా ఫాంటాలో 100ml కి కేవలం 4.6 గ్రాముల చక్కెర మాత్రమే ఉందట.కానీ మన ఇండియన్ ఫాంటాలో మాత్రం 100ml కి ఏకంగా 13.6 గ్రాముల చక్కెర.అంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.

షుగర్ ఒక్కటే కాదు, సోడియం లెవెల్స్ కూడా చూస్తే గుండె గుభేలుమంటుంది.మలేషియా(Malaysia) ఫాంటాలో 100ml కి 3mg సోడియం ఉంటే, ఇండియన్ ఫాంటాలో(Indian Fanta) 22.3mg! దాదాపు ఏడు రెట్లు ఎక్కువ.సర్వింగ్ సైజ్ విషయంలో కూడా తేడా ఉంది.

Advertisement
Fanta Guttu Rattu.. Is It Adulterated In India? Is It The Same In Other Countrie

మలేషియాలో 320ml డ్రింక్ ని సింగిల్ సర్వింగ్‌గా చూపిస్తున్నారు.కానీ ఇండియాలో 300ml డ్రింక్ ని 200ml సర్వింగ్‌గా లెక్కేస్తున్నారు.

అంటే మనం ఎంత చక్కెర, సోడియం తీసుకుంటున్నామో కరెక్ట్‌గా తెలియకుండా కంపెనీలు మాయ చేస్తున్నాయి.ఒకే ప్రొడక్ట్ ని వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా ఎందుకు అమ్ముతున్నారని ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు.

కంపెనీలు ఆయా దేశాల టేస్ట్, ధరలు, రూల్స్ ప్రకారం మారుస్తారని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఇది కేవలం డబ్బులు తగ్గించుకోవడానికి, మార్కెట్ ట్రిక్స్ ప్లే చేయడానికి మాత్రమే అని అంటున్నారు.ప్రజల ఆరోగ్యం గురించి కంపెనీలకు పట్టదా అని నిలదీస్తున్నారు.

Fanta Guttu Rattu.. Is It Adulterated In India Is It The Same In Other Countrie

ఫుడ్ ఫార్మర్ అనే ఫేమస్ హెల్త్ అడ్వకేట్ రేవంత్ హిమత్‌సింగ్‌కా లాంటి వాళ్లు ఫుడ్ లేబుల్స్‌లో నిజాలు చెప్పాలని ఎప్పటినుంచో పోరాడుతున్నారు.లింక్డ్‌ఇన్ యూజర్ కూడా కోకా-కోలా కంపెనీ ఈ తేడాలకి కారణం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.ఇది ఖర్చుల కోసమా, రూల్స్ కోసమా, లేక కస్టమర్ల టేస్ట్ కోసమా అసలు నిజం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

జాయింట్ పెయిన్స్‌తో బాధ‌ప‌డుతున్నారా..అయితే ఇవి తీసుకోవాల్సిందే.!

షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చే జబ్బులు, ఊబకాయం గురించి ప్రజల్లో అవగాహన పెరుగుతున్న కొద్దీ ఈ విషయం హాట్ టాపిక్ అయింది.గ్లోబల్ బ్రాండ్స్ నిజంగా కస్టమర్ల కోసమే ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాయా? లేక రూల్స్ లేని చోట ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాయా? దీనిపై మీరేమంటారు?.

Advertisement

తాజా వార్తలు