సినిమా హీరోల పేరు చెప్పి ఉన్మాదుల్లా మారుతున్న అభిమానులు

సినిమాను ప్రేమించడం లేదా దగ్గరగా పరిశీలిస్తూ ఉండడం వల్ల వారిలోని మనస్తత్వం బాగా గాఢంగా ప్రభావితం అవుతుంది.

అలాంటి సమయంలో వారు అలవరించే గుణాలు, వారి వ్యక్తిత్వం, అలాగే అలవాట్లు నిర్దేశించి స్థాయి, వారి ఆలోచనలను నియంత్రణ చేస్తూ ఉంటుంది.

సినిమాను ప్రేమించడం వేరు.ఆ సినిమా కోసం వెర్రిగా ప్రవర్తించడం వేరు.

సినిమాను ప్రేమించినప్పుడు నీలో అది ఎటువంటి మానసిక సంచలనానికి కారణంగా అవుతుందో ఆలోచించే ఒక స్పృహ ఎంతో అవసరం.లేదంటే కొన్ని పిచ్చిపిచ్చి కార్యక్రమాలను తలనెత్తుకుంటూ ఉంటారు.

నిన్న వీర సింహారెడ్డి సినిమా రిలీజ్ అవుతుంటే బాలకృష్ణ కటౌట్ ముందు ఒక గొర్రెపోతును బలిచ్చారు.ఎందుకు చేశారు ఈ పని అభిమానమా లేక వెర్రితనమా .? ఎందుకు చేసిన ఎలాంటి ఉద్దేశంతో చేసిన హడావిడి చేయడం కోసం లేదా సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం అనేక రకాల పిచ్చి పనులు చేస్తూ ఉంటారు కొంతమంది హీరోల అభిమానులు.బాన సంచా కాల్చడం

Fans Crossing Line For Movie Heors , Fans Crossing Line ,movie Heros , Veera Sim
Advertisement
Fans Crossing Line For Movie Heors , Fans Crossing Line ,movie Heros , Veera Sim

ట్రాఫిక్ రూల్స్ ఊరేగింపుగా వెళ్తూ బండ్ల హారన్లతో వారి జులుం చూపించుకోవడం కోసం ర్యాలీలు తీయడం వంటిది కూడా చేస్తూ ఉంటారు.ఇలాంటి కొన్ని సంఘటనలు చూసినప్పుడు సినిమా మనిషిని ఏ రకంగా మారుస్తుంది అనేది ప్రత్యక్షంగా చూస్తుంటే భయం వేయడం లేదు బాధ మాత్రమే కలుగుతూ ఉంటుంది.

Fans Crossing Line For Movie Heors , Fans Crossing Line ,movie Heros , Veera Sim

చాలా మంది పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్నప్పుడు అటు ఇటుగా అందరి అభిమానులు చేస్తున్న పనులు ఇలాగే ఉంటాయి.సినిమా మాత్రమే ఒక కళారూపంగా కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి.దానిని మించిన ఒక ప్రత్యామ్నాయం గా కనిపిస్తే తప్ప ఇలాంటి ఉన్మాదపు సంఘటనలు జరగకుండా ఉండవు.

కాకపోతే సినిమా అనే కళ వ్యాపారంగా మారిపోయి ప్రజలను ఇంకా పాడు చేసే పరిస్థితి వస్తుంది.మా హీరో గొప్పవాడు అంటే మా హీరోనే గొప్పవాడు అంటూ అభిమానులు తన్నుకుంటూ జైలు పాలు కూడా అవుతున్నారు.

ఇంతటి ఉన్మాదం జరగడం అవసరమా? యువత పాడవడానికి సినిమా మూల కారణం కావాలా ? ఒక్కసారి ఆలోచించండి.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు