RP Patnaik Singer : అభిమానులంతా సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు సర్.. ప్లీజ్ రండి

డైరెక్టర్ గా కావాలని సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ఆర్ పి పట్నాయక్ అనుకొకుండా రవి తేజ నటించిన నీకోసం సినిమాకు సంగీతం అందించాడు.1999 లో విడుదల అయినా ఈ చిత్రంతోనే శ్రీను వైట్ల తొలిసారి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

`ఈ సినిమా పర్వాలేదు అనిపించినా దర్శకుడు తేజ తీసిన చిత్రం సినిమా పట్నాయక్ కెరీర్ ని మలుపు తిప్పింది.

ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అవ్వడమే కాదు ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో అనేక సినిమాలు వచ్చాయి.ఆర్ పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ గా కాస్త సెటిల్ అవ్వగానే డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు.

ఒక్క తెలుగులోనే 43 సినిమాలకు సంగీతం అందించిన ఆర్పీ టాలీవుడ్ లోనే కాకుండా తమిళ్, కన్నడ మరియు హిందీ భాషల్లో కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసాడు.తమిళ్ లో మూడు సినిమాలు, కన్నడ లో 18 సినిమాలకు పని చేసాడు.

సింగర్ గా కూడా కొన్ని పాటలు పాడాడు.ఇక 2008 లో అందమైన మనసులో చిత్రం తో డైరెక్టర్ గా మారిన ఆర్పీ తన కెరీర్ మొత్తం మీద 8 సినిమాలకు పని చేసాడు.

Advertisement
Fans Are Waiting For R P Patnaik Second Innings , Srinu Vaitla, Singer, RP Patna

ఇక నటుడిగా ఐదు సినిమాల్లో లీడ్ రోల్స్ లో నటించాడు.ఇక కెరీర్ లో మూడు సార్లు సంగీతం పరంగా ఫిలిం ఫర్ అవార్డులు అందుకున్నాడు.

అందులో నువ్వు నేను, సంతోషం, ఎగ్జిక్యూజ్ మీ సినిమాలు ఉన్నాయి.అయన సంతోషం సినిమాకు అందించిన సంగీతం ఎంతో ఫ్రెష్ ఫీలింగ్ తో ఇప్పటికి ఎన్ని సార్లు విన్న మళ్లి మళ్లి వినాలనిపించేలా ఉంటుంది.

Fans Are Waiting For R P Patnaik Second Innings , Srinu Vaitla, Singer, Rp Patna

ఇక చాల ఏళ్ళ క్రితం నుంచి ఆయనకు సరైన హిట్ లేకపోవడం తో సంగీతం పరంగా, మారె విధంగానైనా కూడా బయట కనిపించడం మానేసాడు.ఇక అయన మళ్లి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సినిమాలకు పని చేయాలని అందరు కోరుకుంటున్నారు.మల్టీ ట్యాలెంటెడ్ వ్యక్తి గా ఉన్న ఆర్పీ సంగీతం అందించిన ప్రతి సినిమా కూడా మ్యూజికల్ హిట్ అయ్యింది.

ఇప్పటికైనా ఆయన్ను మళ్లి ఇండస్ట్రీ గుర్తించి నటుడిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తే బాగుండు.

పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?
Advertisement

తాజా వార్తలు