బాలయ్య, పవన్ ను టార్గెట్ చేసి టికెట్ రేట్లు తగ్గించలేదు.. వర్మ షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన రామ్ గోపాల్ వర్మ ఏపీలో తగ్గించిన టికెట్ రేట్ల గురించి మంత్రి పేర్ని నానితో ఈరోజు చర్చించారు.చర్చల అనంతరం ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

30 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీతో తనకు అనుబంధం ఉందని ఐదు అంశాల గురించి ముఖ్యంగా మంత్రితో తాను మాట్లాడానని ఆర్జీవీ వెల్లడించారు.ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని వర్మ కామెంట్లు చేశారు.

అయితే మంత్రి కూడా తనతో కొన్ని విషయాలను చెప్పారని సినిమా రంగానికి సంబంధించిన వాళ్లతో మంత్రి చెప్పిన విషయాలను చర్చిస్తానని వర్మ వెల్లడించారు.త్వరలోనే టికెట్ రేట్ల సమస్యకు సొల్యూషన్ దొరుకుతుందని తాను అనుకుంటున్నానని వర్మ అన్నారు.

సినిమా టికెట్ రేట్లను తగ్గించడం ద్వారా ఈ రంగం నష్టపోతుందని కామెంట్లు చేశానని వర్మ వెల్లడించారు.ప్రొడ్యూసర్ గా వాదనను చెప్పడానికి మాత్రమే ఇక్కడికి వచ్చానని వర్మ చెప్పుకొచ్చారు.

Advertisement
Famous Director Ram Gopal Varma Comments About Ap Ticket Rates Issue Details, D

టికెట్ రేట్ల విషయంలో తుది నిర్ణయం మాత్రం ఏపీ ప్రభుత్వానిదే అని వర్మ అన్నారు.

Famous Director Ram Gopal Varma Comments About Ap Ticket Rates Issue Details, D

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ ప్రభావం అందరు హీరోలపై, అన్ని సినిమాలపై పడుతుందని బాలయ్య, పవన్ లను టార్గెట్ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తాను అనుకోనని వర్మ చెప్పుకొచ్చారు.చర్చల విషయంలో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నానని వర్మ కామెంట్లు చేశారు.

Famous Director Ram Gopal Varma Comments About Ap Ticket Rates Issue Details, D

సినిమాను తీసిన వాళ్లకే ఆ సినిమాకు టికెట్ రేట్లను నిర్ణయించే ఛాన్స్ ఇవ్వాలని వర్మ కోరారు.మరోవైపు వర్మతో భేటీ గురించి మంత్రి పేర్ని నాని సైతం స్పందించారు.సినిమా రంగం తరపున ఆర్జీవీలా ఎవరు సూచనలు చేసినా తీసుకుంటామని పేర్ని నాని చెప్పుకొచ్చారు.

వర్మ పేర్ని నానితో చర్చలు జరిపిన రోజునే ఏపీలో నైట్ కర్ఫ్యూ, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలులోకి రావడం గమనార్హం.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు