నరసింహస్వామికి తోడుగా వెలసిన ఆంజనేయస్వామి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

సాధారణంగా మన తెలుగు రాష్ట్రాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన నరసింహ స్వామి ఆలయాలతో పాటు ఆంజనేయస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి.

అయితే ఈ రెండు ఆలయాలు వేరు వేరు ప్రదేశాలలో వెలసి భక్తులకు దర్శనమిస్తున్నారు.

కానీ నరసింహ స్వామికి తోడుగా ప్రసన్నాంజనేయ స్వామి వెలసి ఒకేచోట నరసింహ స్వామి, ఆంజనేయ స్వామి భక్తులకు దర్శనం ఇచ్చేటటువంటి ఆలయం కూడా ఉందని మీకు తెలుసా? అయితే ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశిష్టత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.ప్రకాశం జిల్లాలో సింగరకొండ పై ఈ ఆలయం ఉంది.

సాధారణంగా నరసింహ స్వామి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఆంజనేయస్వామి ఉంటాడు.కానీ ఇక్కడ కొండపై నరసింహ, ఆంజనేయ స్వామి వారు కొలువై ఉండి భక్తులను దర్శనమిస్తున్నారు.

కొండపై నరసింహ స్వామి ఆలయం వెలసి ఉండగా కొండ దిగువున ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ ఉండి భక్తులకు దర్శనమిస్తున్నారు.ఇక్కడ వెలసినటువంటి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే భూత ప్రేత పిశాచాల భయం తొలగిపోతుందని భక్తులు విశ్వసిస్తారు.

Advertisement

ఆలయ విషయానికి వస్తే సుమారు 14వ శతాబ్దంలో సింగన్న అనే నరసింహ స్వామి భక్తుడు ఉండేవాడు.ఆయన కూతురు రోజు ఆవులను కొండపైకి మేపటం కోసం తీసుకు వెళ్ళేది.

ఈ విధంగా ఇంటికి తిరిగి వచ్చిన ఆవు పాలు ఇచ్చేది కాదు.ఒకరోజు అయితే అనారోగ్యం కారణంగా పాలు ఇవ్వదని ప్రతి రోజు పాలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటని ఆలోచించాడు.

ఈ క్రమంలోనే ఒకరోజు ఆవులతో పాటు సింగన్న వెళ్లగా అక్కడ ఉన్నటువంటి కొండపై ఆవుగడ్డి మేస్తుండగా ఒక రాతిలో నుంచి బాలుడు ఉద్భవించి ఆ ఆవు పాలను తాగి వెళ్ళిన ఈ సంఘటనను చూసిన సింగన్న ఎంతో ఆశ్చర్యపోయాడు.నరసింహ భక్తుడు అయినటువంటి సింగన్న కచ్చితంగా తన స్వామి ఇలా బాలుడి రూపంలో వచ్చారని భావించి అక్కడ స్వామివారికి ఆలయ నిర్మాణం చేపట్టారు.అదేవిధంగా ఆంజనేయస్వామి ఆలయానికి కూడా ఓ విశిష్టత ఉంది.

తన తల్లి కోసం వెతుకుతూ దక్షిణాభిముఖంగా బయలుదేరిన ఆంజనేయస్వామి ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవడం వల్ల ఇక్కడ వెలిసిన స్వామివారు దక్షిణాభిముఖుడై భక్తులకు దర్శనమిస్తున్నారని ఆలయ చరిత్ర చెబుతోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్6, బుధవారం2024
Advertisement

తాజా వార్తలు