ఒకే సినిమా తో ఎంతో సాహసం చేసిన జమున.. రెబల్ స్టార్ గా మారిన కృష్ణం రాజు

బంగారు తల్లి( Bangaru Thalli Movie ) అనే సినిమా 1971లో వచ్చింది.

ఈ చిత్రంలో జమున( Jamuna ) నట విశ్వరూపం మనం కల్లారా చూడొచ్చు.

అప్పటి వరకు ఆమె ఒక గ్లామర్ క్వీన్ గా, సత్యభామగా వెండితెరపై అద్భుతమైన హోయలు ఒలికించిన జమున ఈ సినిమాతో ఎంతో ధైర్యంగా ఒక డీ గ్లామర్ పాత్రలో నటించడానికి ముందుకు వచ్చింది.వాస్తవానికి జమున ఈ పాత్ర ఒప్పుకుంది అని తెలియగానే చాలామంది వద్దు అని వారించారు.

అయినా కూడా మొండిగా ఈ సినిమా చేయాలని ఆమె నిర్ణయించుకుంది.ఈ చిత్రంలో ఆమె ముసలి పాత్రలో కూడా నటించాల్సి వచ్చింది.

ఆమె కొడుకులుగా శోభన్ బాబు,( Sobhan Babu ) కృష్ణంరాజు ( Krishnam Raju ) నటించారు.ఈ సినిమాతోనే కృష్ణంరాజు ఒక రెబల్ స్టార్ గా మారారు అని అనుకోవచ్చు.

Advertisement

అప్పటి వరకు ఆయనకు ఒక్క సరైన పాత్ర పడలేదు కానీ బంగారు తల్లి సినిమా కృష్ణంరాజులో ఉన్న ఒక రెబల్ స్టార్ ని ప్రపంచానికి పరిచయం చేసింది.

ఈ సినిమా తెలుగులో బ్రహ్మాండమైన వసూళ్లను వసూలు చేసింది.అయితే తెలుగులో చాణక్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి మాతృక హిందీలో మదర్ ఇండియా( Mother India ) అనే పేరుతో 1957లో వచ్చింది.దీంట్లో జమున పాత్రలో నర్గీస్ ( Nargis ) నటించగా, కలెక్షన్స్ తెలుగుతో పోలిస్తే హిందీ లో చాలా తక్కువగానే వచ్చాయి.

హిందీ సినిమా కూడా చాలా బాగుంది.అప్పట్లో ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మన ప్రధానమంత్రి నెహ్రూ అలాగే రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్రప్రసాద్ ప్రత్యేకమైన ఒక షో వేయించుకొని చూశారట.

అలాగే చిత్రానికి అనేక అవార్డులు దక్కగా ఉత్తమ చిత్రం తో పాటు ఫిలింఫేర్ అవార్డులను కూడా పొందింది.

Lorem Ipsum Dolor Sit Amet
Lorem Ipsum Dolor Sit Amet

ఇప్పటి తరం వారికి ఇలాంటి సినిమాలు పెదగా నచ్చకపోవచ్చు.కానీ ఖచ్చితంగా చూడవలసిన సినిమా అని మాత్రం చెప్పక తప్పదు.1940లో ఔరత్( Aurat Movie ) అన్న ఒక సినిమా రాగా దాన్ని ఆధారంగా చేసుకుని మదర్ ఇండియా సినిమాను తీశారు.మదర్ ఇండియా చిత్రాన్ని ఆధారంగా చేసుకుని బంగారు తల్లి సినిమా తీశారు.

Advertisement

అన్ని విధాలుగా తెలుగులో ఈ సినిమా బ్రహ్మాండమైన కలెక్షన్స్ సాధించి మంచి విజయాన్ని అందుకుంది.చూడాలనుకుంటే యూట్యూబ్ ఈ మూడు సినిమాలు ఉన్నాయ్.

తాజా వార్తలు