ఎఫ్ 2 భామలకు ఎఫ్ 3 అంత లక్ ఇవ్వలేదా.. అంతా వ్యర్ధమేనా?

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ఎఫ్ 3.ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది.

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ ఎఫ్ 3 సినిమాను కూడా చేసాడు.ఈ సినిమా గత నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా తొలిరోజు నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.దీంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకు పోతుంది.

దేవిశ్రీ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను శిరీష్ నిర్మించారు.ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా.

Advertisement

వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటించారు.అయితే ఈ సినిమాపై ఇద్దరు ముద్దుగుమ్మలు భారీ హోప్స్ నే పెట్టుకున్నారు.

కానీ వీరికి మాత్రం ఈ సినిమా అసలు ఉపయోగ పడలేదని అంటున్నారు.ఎఫ్ 2 సినిమా సమయంలో నటించిన తమన్నా కు, మెహ్రీన్ కు మంచి పేరు వచ్చింది.

వీరి ఇద్దరి పాత్రలు కూడా పేక్షకులను బాగా అలరించాయి.అప్పట్లో వీరికి ఈ సినిమా విజయంతో మంచి మంచి అవకాశాలు కూడా వచ్చాయి.

అయితే ఇప్పుడు మాత్రం తమన్నా, మెహ్రీన్ లకు ఈ సినిమా వల్ల పెద్దగా ఒరిగింది ఏమీ లేదు.వీరి కెరీర్ కు కూడా ఈ సినిమా పెద్దగా ఉపయోగ పడలేదనే చెప్పాలి.

లిచి పండ్లలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?

వీరిద్దరితో పాటు ఇంకా ఎఫ్ 3 లో సోనాల్ చౌహన్ కీలక పాత్రలో నటించగా.పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది.అయితే ఇంత మంది నటించి ఈ సినిమాకు గ్లామర్ జోడించిన కూడా హీరోయిన్లకు పెద్దగా పేరు రాలేదు.

Advertisement

అంతేకాదు మిగతా పాత్రలకు ప్రాధాన్యం ఉంది కానీ హీరోయిన్ పాత్రలకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో వీరికి నిరాశే ఎదురయ్యింది.

తాజా వార్తలు