'ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్' మూవీ క్లోసింగ్ కలెక్షన్స్..శ్రీలీల కి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా రికవరీ అవ్వలేదు!

మీడియం రేంజ్ హీరోలలో టాక్ తో సంబంధం లేకుండా మినిమం గ్యారంటీ వసూళ్లను రాబట్టే హీరోల లిస్ట్ తీస్తే నితిన్ ( Nithiin )ముందు వరుసలో ఉంటాడు.

ఆయన గత చిత్రం మాచెర్ల నియోజకవర్గం ( Macherla Niyojakavargam )డిజాస్టర్ ఫ్లాప్ తెచుకున్నప్పటికీ కూడా, ఓపెనింగ్స్ విషయం లో మాత్రం దంచి కొట్టేసింది.

కానీ నితిన్ గత చిత్రాల ఫ్లాప్స్ ప్రభావం రీసెంట్ గా విడుదలైన ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్ సినిమా మీద పడింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఎన్నడూ లేని విధంగా, ఆయన కెరీర్ లో మొట్టమొదటిసారి మొదటిరోజు 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా కలిపి వచ్చిందట.

షేర్ రెండు కోట్ల రూపాయిలు కూడా లేకపోవడం గమనార్హం.ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 23 కోట్ల రూపాయలకు జరిగింది.

టాక్ వచ్చి ఉంటే కేవలం మూడు రోజుల్లోనే 90 శాతం రికవరీ అయ్యేది.

Extraordinary Men Movie Closing Collections..remuneration Given To Srilila Is No
Advertisement
Extraordinary Men Movie Closing Collections..Remuneration Given To Srilila Is No

కానీ టాక్ రాకపోవడం తో రెండవ రోజు ఈ చిత్రానికి కేవలం రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.ఇది నితిన్ కెరీర్ లోనే డిజాస్టర్ వసూళ్లు అని చెప్పొచ్చు.ఆయన గత చిత్రం మాచెర్ల నియోజకవర్గం మొదటిరోజు దాదాపుగా 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది.

కానీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్( Extraordinary Man ) చిత్రానికి వీకెండ్ లో కూడా అంత వసూళ్లు రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.ఇక వర్కింగ్ డేస్ లో ప్రస్తుతం సూపర్ హిట్ సినిమాలు రన్ అవ్వడమే చాలా కష్టతరంగా మారింది.

ఎనిమల్ లాంటి చిత్రాలు ఆడుతున్నాయి కానీ, నార్మల్ హిట్ సినిమాలు కేవలం వీకెండ్స్ లోనే ఆద్జుతున్నాయి.

Extraordinary Men Movie Closing Collections..remuneration Given To Srilila Is No

అలాంటిది ఫ్లాప్ సినిమాలకు వసూళ్లు రావడం చాలా కష్టం.సోమవారం నుండి నెగటివ్ షేర్స్ రావడం తో ఈ చిత్రాన్ని దాదాపుగా అన్నీ థియేటర్స్ లో తీసేసారు.అలా ఓవరాల్ గా నాలుగు కోట్ల 50 లక్షల రూపాయలకు వసూళ్లు క్లోజ్ అయిపోయాయి.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించినందుకు శ్రీలీల( Sreeleela ) కి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిలు ఇచ్చారట.పబ్లిసిటీ కాస్ట్ తీసేయగా, ఫుల్ రన్ లో శ్రీలీల కి ఇచ్చిన రెమ్యూనరేషన్ ని కూడా రికవర్ చేయలేకపోయిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Advertisement

నితిన్ అందుకుంటున్న వరుస ఫ్లాప్స్ ని చూస్తూ ఉంటే, ఇష్క్ చిత్రానికి ముందు నితిన్ ఎలాంటి ఫేస్ ని ఎదురుకున్నాడో ,మళ్ళీ అలాంటి ఫేస్ ని ఎదురుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.ఇష్క్ ముందు నితిన్ కెరీర్ ఎలా ఉన్నిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తే నితిన్ కెరీర్ ముగిసినట్టే అని విశ్లేషకులు అంటున్నారు.

తాజా వార్తలు