ఋషిత్రయం గురించి వివరించండి?

రాజర్షి, మహర్షి, దేవర్షి అను వారిని ఋషిత్రయం అంటారు.ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అనికూడా వ్యవహరిస్తారు.

రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.ఈయనకు వేద తత్త్వ జ్ఞానం కూడా సమగ్రంగా ఉంటుంది.

Explain About Rushi Thrayam Details, Devarshulu, Maharshulu, Rajarshulu, Rushitr

పూర్వం యోగ విద్యలో రాజర్షులు నిష్ణాతులై ఉండే వారు.భగవంతుడు వివస్వంతునికీ, వివస్వంతుడు మనువుకూ, మనువు ఇక్ష్వాకునకూ బోధించిన బ్రహ్మ విద్య రాజర్షులలో పరంపరాగతమై ఉండేదని భగవద్గీతను బట్టి తెలుస్తున్నది.

సాధారణ ఋషి స్థాయిని దాటి ఈ గొప్ప ఋషులు మహర్షులు అయ్యారు.మహర్షయః సప్త పూర్వే అన్న గీతా వచనాన్ని బట్టి ఏడుగురు పూర్వ మహర్షులు భగవత్ సంకల్పంతో జన్మించినారు.

Advertisement

పురాణాలలో అనేకులు మహర్షులుగా పేర్కొనబడినప్పటికీ మరీచి రంగిరా శ్చాత్రిః పులస్యః పులహః క్రతుః। వసిష్ఠ ఇతి సప్లైతే మానసా నిర్మితా హితే॥ అన్న ప్రమాణాన్నిబట్టి స్వాయంభువ మన్వంతరంలో మార్పును అనుసరించి మహర్షులలో కూడా భేదం ఉండేది.భృగు మహర్షి భగవత్ స్వరూపుడుగా గీతలో పేర్కొనబడింది.

(మహర్షీణాం భృగురహం).ఈ మహర్షులు వేద విదులు, ప్రవృత్తి ధర్మం పాటిస్తూ ప్రాజాపత్యం కల్గి ఉండేవారు.

దేవర్షులు అనగా “దేవలోక ప్రతిష్టాశ్చ జ్ఞేయా దేవర్షయః శుభాః” అన్నట్లు దేవ లోకంలో ప్రతిష్ఠ గల వారు దేవర్షులుగా వినతికెక్కారు.అన్నట్లు ధర్ముని పుత్రులైన నర నారాయణులు, క్రతు పుత్రులైన వాలఖిల్యులు, పులహుని కుమారుడైన కర్దముడు, కశ్యప సుతులైన పర్వత నారదులు దేవతలను సైతం నియమించగల వారు దేవర్షులుగా పేర్కొనబడ్డారు.

Victory Venkatesh : హీరోయిన్లతో గొడవ పడుతున్న స్టార్ హీరో....మాటలు కూడా లేవట?
Advertisement

తాజా వార్తలు