ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు : ఢిల్లీ పీఠం మళ్లీ చీపురుకే

దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకులు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యాయి.

పోలింగ్‌ సమయం పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే పలు మీడియా సంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను విడుదల చేశాయి.

ఈ ఫలితాల్లో ఎక్కువ శాతం కేజ్రీవాల్‌కే పీఠం దక్కడం ఖాయం అంటున్నారు.హస్తిన ప్రజలు మళ్లీ కూడా సీఎంగా కేజ్రీవాల్‌ రావాలని ఓట్లు వేసినట్లుగా ఈ ఫలితాలు చెబుతున్నాయి.

Exitpolls Results Shows In Delhi Is Aap-ఎగ్జిట్‌ పోల్�

మరోసారి క్లీయర్‌ మెజార్టీతో కేజ్రీవాల్‌ మూడవ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అంటున్నారు.కొన్ని మీడియా సంస్థల అంచనా ప్రకారం కేజ్రీవాల్‌కు పూర్తి స్థాయి సీట్లు రాకపోవచ్చు.

మ్యాజిక్‌ ఫిగర్‌కు అయిదు నుండి పది సీట్ల దూరంలో కేజ్రీవాల్‌ ఉండే అవకాశం ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ఢిల్లీ పీఠం మాత్రం కేజ్రీవాల్‌దే అంటూ 90 శాతం ఫలితాలు చెబుతున్నాయి.

Advertisement

దాంతో ముందు నుండే ఆప్‌ విజయోత్సవాలకు సిద్దం అయ్యింది.ఈనెల 11న ఫలితాల వెళ్లడి ఉంటుంది.

అదే రోజు హస్తినలో ఏ పార్టీ ప్రభుత్వంను ఏర్పాటు చేయబోతుందో క్లారిటీ వచ్చేను.హస్తిన గడ్డపై బీజేపీ జెండా ఎగరవేసేందుకు మోడీ అమిత్‌షాలు తీవ్రంగా ప్రయత్నించారు.

కాని వారి ప్రయత్నాలు విఫలం అయినట్లుగానే అనిపిస్తుంది.

వార్నీ... ఏడిస్తే కూడా ఇన్ని లాభాలు ఉన్నాయా??
Advertisement

తాజా వార్తలు