సుప్రీంలో మాజీ మంత్రి వైఎస్ వివేకా హ‌త్య కేసు విచార‌ణ‌

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసుపై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది.

ఈ కేసులో ద‌ర్యాప్తు వేగంగా సాగ‌డం లేద‌ని, ఈ క్ర‌మంలో అధికారిని మార్చాలంటూ ఏ5 నిందితుడిగా ఉన్న శివ‌శంక‌ర్ భార్య తుల‌స‌మ్మ పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో సీబీఐ తీరుపై ధ‌ర్మాస‌నం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.సీబీఐ స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగ‌తి లేద‌ని మండిప‌డిందని తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో విచార‌ణ అధికారిని మార్చండి లేదా.ఇంకో అధికారిని నియ‌మించాలని సుప్రీం కోర్టు తెలిపింది.

అనంతరం త‌దుప‌రి విచార‌ణ ఈనెల 29కు వాయిదా వేసింది.అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసుపై తెలంగాణలో విచార‌ణ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు