ఈ గ్రీన్ జ్యూస్ తో రక్తహీనత నుంచి అధిక బరువు వరకు అన్నిటికీ చెక్ పెట్టవచ్చు!

రక్తహీనత( Anemia ) తోబాధపడుతున్నారా.? బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా.? తరచూ అలసట నీరసం వేధిస్తున్నాయా.

? రక్తపోటు అదుపు తప్పుతుందా.? డోంట్ వర్రీ ఇప్పుడు చెప్పబోయే గ్రీన్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే ఆయా సమస్యలన్నిటికీ సులభంగా చెక్ పెట్టవచ్చు.మరి ఆ గ్రీన్ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? మరియు అది అందించే ప్రయోజనాలు ఏంటి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా చిన్న కీర దోసకాయ( Cucumber )ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న‌ ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఐదు ఫ్రెష్ పాలకూర ఆకులను తీసుకుని వాటర్ తో కడిగి కట్ చేసుకుని పెట్టాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో అర కప్పు సీడ్ లెస్ గ్రేప్స్ వేసుకోవాలి.

అలాగే కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలు, పాలకూర( Spinach ), ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.అంతే మన గ్రీన్ జ్యూస్ సిద్ధం అయినట్టే.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేసి తీసుకోవాలి.వారంలో కనీసం నాలుగు సార్లు ఈ గ్రీన్ జ్యూస్ ను తీసుకుంటే శరీరానికి అవసరమయ్యే ఐరన్( Iron ) లభిస్తుంది.

Advertisement

హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.దీంతో రక్తహీనత పరార్ అవుతుంది.

అలాగే ఈ గ్రీన్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల వెయిట్ లాస్( Weight Loss ) అవుతారు.పొట్ట కొవ్వు కరుగుతుంది.

రక్తపోటు అదుపులో ఉంటుంది.మధుమేహం, గుండె జ‌బ్బులు, క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.

ఒకవేళ మధుమేహం ఉంటే కనుక బ్లడ్ షుగర్ లెవల్స్( Blood Sugar Levels ) కంట్రోల్ తప్పకుండా ఉంటాయి.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

అంతేకాదండోయ్‌.ఈ గ్రీన్ జ్యూస్( Green Juice ) ను తీసుకోవ‌డం వ‌ల్ల నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

Advertisement

శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. బాడీ డిటాక్స్( Body Detox ) అవుతుంది.

చర్మం నిగారింపుగా యవ్వనంగా మెరుస్తుంది.జుట్టు రాలడం తగ్గుతుంది.

మరియు కంటి చూపు సైతం రెట్టింపు అవుతుంది.కాబట్టి హెల్తీ గా ఫిట్ గా మరియు ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండాలి అని కోరుకునే వారు తప్పకుండా ఈ గ్రీన్ జ్యూస్ ను డైట్ లో చేసుకోండి.

తాజా వార్తలు