రాచకొండ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా: రాచకొండ అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని రాచకొండ రాచప్ప సమితి సభ్యులు పిలుపునిచ్చారు.

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో రాచకొండ రాచప్ప సమితి ఆధ్వర్యంలో రాచకొండ అభివృద్ధి భవిష్యత్ కార్యాచరణ సర్వసభ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాచకొండలో అన్ని దేవాలయాలతో పాటు ప్రాచీన శివాలయం పునర్నిర్మాణం చేయాలని నిర్ణయించుకున్నామన్నారు.ప్రస్తుత ప్రభుత్వం రాచకొండ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా, టూరిజం సిటీగా ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం చొరవ తీసుకునే విధంగా కమిటీ కృషి చేయాలని తీర్మానం చేసినట్లు తెలిపారు.

ఈనెల 21న నారాయణపురం మండలానికి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీల,సబ్బండ వర్గాల ప్రజలను, యువజన,కుల సంఘాల సభ్యులను కలుపుకొని అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో బద్ధుల కృష్ణ కుమార్ యాదవ్,సూరపల్లి వెంకటేష్,శ్రీదేవి,నిమ్మల నగేష్,ముత్యాల చంద్రయ్య,అంజిరెడ్డి,రసాల వెంకటేష్,తెలంగాణ భిక్షం,దూసరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
Advertisement

Latest Yadadri Bhuvanagiri News