హైదరాబాద్ లో ల్యాండ్ అయినా డేవిడ్ భాయ్.. ఈసారి మ్యాచ్ కోసం కాదండోయ్!

క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనర్లలో ఒకరైన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ (David Warner) పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బ్యాటింగ్‌లో తన దూకుడు, అద్భుతమైన షాట్లతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వార్నర్, కేవలం క్రికెట్‌లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్ అయ్యాడు.

ప్రత్యేకంగా, తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన క్రికెటర్ అని చెప్పాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన అతను, హైదరాబాద్ అభిమానులకు ప్రత్యేకమైన అనుబంధంగా మారిపోయాడు.

అంతేకాక, తెలుగులో పలు ఫిల్మీ రీల్స్ చేస్తూ తెలుగు సినిమాలకు, హీరోల మేనరిజానికి మరింత దగ్గరయ్యాడు.పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్టైల్‌ను అనుకరించి తన వీడియోలతో అభిమానులను ఎంతగానో అలరించాడు.

Even Though He Landed In Hyderabad, David Bhai Wasnt There For The Match This T

అత్యధికంగా క్రికెట్ అభిమానులను కలిగి ఉన్న వార్నర్ ఇప్పుడు తెలుగు సినిమాల్లోనూ అడుగు పెట్టాడు.టాలీవుడ్ యంగ్ హీరో నితిన్( Nitin ) హీరోగా నటిస్తున్న ‘రాబిన్ హుడ్’ సినిమాలో డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.టాలీవుడ్ ప్రేక్షకులకు ఇది ఎంతో ఆసక్తికరమైన వార్త.

Advertisement
Even Though He Landed In Hyderabad, David Bhai Wasn't There For The Match This T

ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ఈరోజు (మార్చి 24) సాయంత్రం గ్రాండ్‌గా జరగనుంది.మొదటగా, ఈ ట్రైలర్‌ను IPL 2024 ఓపెనింగ్ సెర్మనీలో రిలీజ్ చేయాలని భావించారు.

కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సాధ్యంకాలేదు.అందుకే, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేయాలని నిర్ణయించారు.

Even Though He Landed In Hyderabad, David Bhai Wasnt There For The Match This T

ఇకపోతే, ఈ కార్యక్రమం కోసం ప్రస్తుతం డేవిడ్ వార్నర్ ఇప్పటికే హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు.ఈ ఈవెంట్‌లో నితిన్, హీరోయిన్ శ్రీలీలతో( heroine Srilieela ) కలిసి అతను ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.మొదట యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను నిర్వహించాలని భావించినా, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైటెక్ సిటీలోని నోవాటెల్ హోటల్ కు మార్చారు.

ఈ ప్రీ-రిసిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని డేవిడ్ వార్నర్ తన అనుభవాలను షేర్ చేసుకుంటాడా? ఫ్యాన్స్‌తో ఇంకెలాంటి ఫన్ చేయనున్నాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా, టాలీవుడ్‌లో భారీ చిత్రాలను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో హిట్.. గేమ్ ఛేంజర్ మూవీ సాధించిన రికార్డ్ ఇదే!
రోడ్డుపై బైకర్‌ను మింగేసిన సింక్‌హోల్.. లైవ్ వీడియో చూస్తే షాక్ అవుతారు!

నవీన్ ఎర్నేని, ఎలమంచి రవిశంకర్ ఈ చిత్ర నిర్మాతలు.ఈ మూవీ మార్చి 28న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.

Advertisement

క్రికెట్ మైదానం నుంచి టాలీవుడ్ వెండితెర వరకు, డేవిడ్ వార్నర్ కొత్త ప్రయాణం తెలుగు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.వార్నర్ స్టైల్, రాబిన్ హుడ్ మాస్ ఎంటర్టైనర్ ఈ కాంబినేషన్ హిట్ అవుతుందా? అనేది చూడాలి.

తాజా వార్తలు