చంద్రబాబుపై ఈటల రాజేందర్ సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్( Etela Rajender ) టీడీపీ అధినేత చంద్రబాబుపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు వేలు పెడుతున్నారు అని ఆరోపణ చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ నీ( Congress ) గెలిపించే ప్రయత్నాలు చేస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత కాంగ్రెస్ నీ పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారని ఈటల పేర్కొన్నారు.2018వ సంవత్సరంలో కాంగ్రెస్ తో కలిసి తెర ముందు ప్రచారం చేసిన చంద్రబాబు 2023లో కాంగ్రెస్ గెలుపుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో కాంగ్రెస్ పై ప్రజలకు విశ్వాసం లేదని బీజేపీ తోనే( BJP ) అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకోవడం తెలిసిందే.చంద్రబాబు( Chandrababu Naidu ) తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్( Kasani Gnaneshwar ) పార్టీకి రాజీనామా కూడా చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరగబోతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈనెల 30వ తారీకు ఎన్నికలు కావడంతో నాయకులు.

Advertisement

కార్యకర్తలు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు.

'డాకు మహారాజ్ ' సినిమా ట్రైలర్ లో బాబీ చేసిన తప్పు ఏంటో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు