బిడ్డ పుట్టడానికి మూడు గంటల ముందు గర్భవతి అని తెలిసింది

కడుపులో బిడ్డ పెరుగుతున్నట్లు ఆవిడకి తెలీనే తెలీదంట.ఇదేలా సాధ్యం అని ఆశ్చర్యపోకండి.

అవును, బిడ్డకు జన్మనిచ్చే మూడు గంటల ముందు తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది.ఇదేమి వింత .ఇదెక్కడి వింత అని అనుకుంటున్నారా? ఇది ఇంగ్లాండ్ లో జరిగిన వింత.ఆవిడ పేరు ఎమ్మా ప్రెస్కాట్.

వయసు 39.బాగా లావుగా ఉండటంతో ఏదో అధునాతనమైన సర్జరీ చేయించుకుంటోంది.నొప్పిగా అనిపించినప్పుడల్లా ఆ సర్జరీ వల్లే అనుకునేదంట.

ఎందుకంటే ఆ సర్జరీ చేసేటప్పుడే ఆవిడకి చెప్పారు నొప్పులు అవుతాయని, కిడ్నీలో రాళ్ళు కూడా వస్తాయని.అదే జరుగుతోంది అని అనుకుంది ఎమ్మా.

Advertisement

కొన్ని నెలలు గడిచాక ఓరోజు రాత్రి భరించలేని నొప్పి కలిగింది.హాస్పిటల్ కి వెళితే తెలిసింది తాను గర్భవతి అని.వెంటనే బిడ్డను బయటకు తీసారు డాక్టర్లు.బిడ్డ సురక్షితంగానే ఉంది.

ఇక్కడ మీకు ఒక డౌటు రావాలి .ఎంత బరువుండి సర్జరీ చేయించుకున్నా, కడుపులో బిడ్డ పడిన సంగతి ఆవిడకు ఆమాత్రం తెలియలేదా ? ఒక్కసారి కుడా టెస్టు చేయించుకోవాలని అనిపింలేదా అని? ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది."పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్" అనే సమస్య వలన ఎమ్మా ఎప్పటికి తల్లి కాలేదని చెప్పారట డాక్టర్లు.

అందుకే తన అలోచనలు ఎప్పుడు గర్భం వైపు పోలేదట.అసలు తల్లి అయ్యే యోగ్యతే లేదని చెప్పారు .ఇన్ని సంవత్సరాల తరువాత నువు తల్లివి అవుతున్నావు అనే చెప్పేసరికి ఎమ్మా సంతోషానికి అవధులు లేకుండాపోయింది.తన బిడ్టని మిరాకిల్ చైల్డ్ అని అంటోంది ఎమ్మా.

ఎందుకంటే ప్రపంచంలో ఇంతకన్న అద్భుతమైన ప్రసవం మరెవరికి కాలేదేమో .ఇలాంటి అద్భుతం జరగడం నిజంగా అద్భుతం అని తన భావన.

ల‌వ్ లో ఉండ‌గా... టెలిగ్రామ్ పంపిన అనుభూతి.! ఇప్ప‌టికీ ఆ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ యా ఆయ‌న న‌న్ను ఆట‌ప‌ట్టిస్తుంటారు.!
Advertisement