ఒక్క మరణం.. అంతులేని ప్రశ్నలు.. సమాధానాలు దొరికేనా..?

మంచో చెడో జరగాల్సిన కార్యక్రమం జరిగిపోయింది.తారకరత్న అంత్యక్రియలు కూడా ముగిసాయి.

కానీ సగటు ప్రేక్షకుడిని కొన్ని వందల ప్రశ్నలు వేధిస్తున్నాయి.

పుట్టిన వాడు ఎవడైనా సరే గిట్టక మానడు కానీ చనిపోవాల్సిన వయసులో చనిపోతే సమస్య లేదు చిన్న వయసులో ఈ లోకాన్ని వీడటంతోనే తారకరత్న విషయంలో సామాన్య ప్రేక్షకుల నుంచి నందమూరి అభిమానుల వరకు అందరూ ఎమోషనల్ అవుతున్నారు మరి ముఖ్యంగా తారకరత్న చనిపోయిన తీరు ఆ సమయంలో కుటుంబ సభ్యులు వ్యవహరించిన విధానం హాస్పిటల్ లో జరిగిన తతంగం అంతా కూడా మీడియా సాక్షిగా చూస్తూ జనాలు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు.

మరి ఆ అంతులేని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందో లేదో తెలియదు కానీ మరణించిన వారైతే తిరిగి రారు.

Endless Questions About Taraka Rathna Issue , Tarakaratna, Kuppam, Balakrishna,

మొదటగా కుప్పంలో తారకరత్న కుప్పకూలిపోయిన రోజు నుంచి నిన్నటి అంత్యక్రియల వరకు అన్నీ తానై నడిపించాడు బాలకృష్ణ.చివరికి పిల్లల్ని దగ్గర తీసుకోవడం, వారితో కొబ్బరికాయలు కొట్టించడం ప్రతి ఒక్క కార్యక్రమం బాలకృష్ణ చెప్పిన విధంగానే జరుగుతూ రావడంతో తారక రత్న తల్లిదండ్రులు ఈ సమయంలో కూడా ఎందుకు దూరంగా ఉన్నారు అనే ప్రశ్న అందరిలో మెదులుతుంది.క తారకరత్న ఆసుపత్రిలో ఉన్న రోజు నుంచి చనిపోయే రోజు వరకు కూడా ఒక్కసారి కూడా తండ్రి మోహనకృష్ణ అటువైపు వెళ్ళకపోవడం బాలకృష్ణ హాస్పిటల్ ఖర్చులు కూడా భరించడం ఇవన్నీ చేశాయా అనే భావన కూడా వస్తోంది.

Endless Questions About Taraka Rathna Issue , Tarakaratna, Kuppam, Balakrishna,
Advertisement
Endless Questions About Taraka Rathna Issue , Tarakaratna, Kuppam, Balakrishna,

ఇక తారకరత్న మృతదేహాన్ని హైదరాబాద్ కి తరలించినప్పటి నుంచి హైడ్రామా కొనసాగుతుంది.తారకరత్న తన కష్టార్జితంతో మోకిలలో ఒక ఇంటిని కొనుక్కున్నాడు ఆ ఇంట్లోనే జీవిస్తున్నారు చనిపోయిన తర్వాత తండ్రి మోహనకృష్ణకి ఉన్న జూబ్లీహిల్స్ లో గల పెద్ద భవనానికి తీసుకెళ్తారని అందరూ అనుకున్నా అలా జరగలేదు.అందరి సందర్శనార్థం మృతదేహాన్ని అసోసియేషన్ బిల్డింగ్ లో పెట్టినప్పుడు మాత్రమే అందరూ వచ్చారు అప్పటివరకు తండ్రి మోహనకృష్ణ, తల్లి శాంతి, చెల్లి రూప తారకరత్న చివరి చూపుకు రాలేదు.

దాంతో ఇంకా కుటుంబంలో ఉన్న వివాదాలు మీడియా ముఖంగా బయటపడ్డాయి చివరికి అంత్యక్రియల సమయంలో వచ్చిన మోహన కృష్ణ గాని మరి ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఒకరు కూడా తారకరత్న భార్య అలేఖ్యను పరామర్శించకపోగా పిల్లల్ని కూడా దగ్గర తీసుకోలేదు.చేతికి అందేంత దూరంలో ఉన్న వారిని కనీసం ఒక చూపు కూడా చూడలేదు మోహనకృష్ణ కుటుంబ సభ్యులు అంటే అలేఖ్య పై అంతటి కోపాన్ని వాళ్ళు ఇంకా మనసులో అలాగే ఉంచుకున్నారు.

చెట్టు అంత కొడుకు పోయిన ఈ కోపతాపాలు ఎందుకు అని చాలామంది అనుకుంటున్నారు నందమూరి కుటుంబం అంతా కూడా అనేక అండగా ఉండాలని కోరుకుంటున్నాను.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు