టైమ్ చూసి కేసీఆర్ ని లాక్ చేసిన ఉద్యోగ సంఘాలు?

తెలంగాణలో రాబోయే ఎన్నికలను దృష్టి పెట్టుకుని అనేక వర్గాలను ప్రసన్నం చేసుకునే పని మొదలుపెట్టిన కేసీఆర్కు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం( Govt Employees ) నాకేమిటంటూ నిలదీస్తుంది.

నిజానికి సమయం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలన్న సూత్రాన్ని తెలంగాణ ఉద్యోగులు పాటిస్తున్నట్లుగా తెలుస్తుంది .

ఇప్పుడు కేసీఆర్( CM KCR ) ఉన్న మూడ్లో విషయాన్ని తేల్చుకుంటే ఫలితం అనుకూలంగా వస్తుంది అని భావిస్తున్న ఉద్యోగులు ఇప్పుడు తమ డిమాండ్ల చిట్టా తో సచివాలయానికి క్యూ కడుతున్నారు.అందులో ముఖ్యమైనవి కొత్త పిఆర్సి ఏర్పాటు ,ఈహెచ్సి అమలు ,సిపిఎస్ రద్దు , బకాయిల చెల్లింపు వంటివి ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.

కొత్త పిఆర్సి ఏర్పాటు చేయటం ఎలానో ప్రభుత్వ బాధ్యత కాబట్టి దానికి ప్రభుత్వం వైపు నుంచి అభ్యంతరం ఏమీ ఉండకపోవచ్చు అంతేకాకుండా జీతాలు బకాయిలు వంటి చిన్న చిన్న అంశాలపై కూడా ప్రభుత్వం నుంచి పెద్దగా ప్రతిఘటన ఉండదు అయితే సిపిఎస్( CPS ) రద్దు అన్నది మాత్రం ప్రభుత్వానికి తలకు మించిన భారం అనే చెప్పాలి.నిజానికి ఈ డిమాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అతిపెద్ద ఇబ్బందిగా మారిన డిమాండ్ గా చెప్పవచ్చు .ఇచ్చిన హామీని నెరవేర్చులేక వచ్చే ఆర్థిక భారాన్ని తట్టుకోలేక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మధ్య మార్గంగా మరో కొత్త విధానంతో తాత్కాలికంగా సరిపెట్టింది.అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ హామీ ఇచ్చి ఉన్నందున కేసీఆర్కు ఇది అతి పెద్ద పరీక్ష నిలవబోతోంది ,

అయితే తాత్కాలిక ప్రయోజనం కోసం సిపిఎస్ రద్దుకు ఒప్పుకుంటే మాత్రం ప్రభుత్వంపై అతిపెద్ద భారం పడటంతో ఆచితూచి స్పందించాల్సిన పరిస్థితి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఉంది.కాస్త మెజారిటీ తగ్గినా మళ్లీ అధికారంలోకి తామే వస్తామని భావిస్తున్న భారాశా( BRS ) ఇలాంటి కీలకమైన డిమాండ్లు పై ఆచితూ స్పందించాల్సిన అవసరం ఉంది.హామీ ఇచ్చేస్తే కనుక తరువాత ప్రభుత్వ సంఘాల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోవటం తలకి మించిన భారం అవుతుందని భావిస్తున్న కేసీఆర్ ఇప్పుడు ఈ నిర్ణయం పై మల్ల గులాలు పడుతున్నట్లుగా తెలుస్తుంది.

Advertisement

మరి సమయం చూసి కేసీఆర్ ని లాక్ చేసిన ఉద్యోగ సంఘాలు మరియు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి .

సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా
Advertisement

తాజా వార్తలు