చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం.. యువకుడిపై దాడి

ఉమ్మడి చిత్తూరు జిల్లా( Chittoor District )లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.గుడిపల్లి మండలం అత్తినత్తంలో గజరాజులు( Elephant Attack ) సంచరించాయి.

ఈ క్రమంలోనే వ్యవసాయ క్షేత్రంలో బోరు వద్దకు వెళ్లిన యువకుడిపై ఏనుగులు దాడికి పాల్పడ్డాయి.అటు శాంతిపురం మండలంలో మరో ఒంటరి ఏనుగు హల్ చల్ చేసింది.

ఎస్ గొల్లపల్లి, కోనేరు -కుప్పం మార్గంలో ఓ కారుపై ఏనుగు దాడి చేసిందని తెలుస్తోంది.దీంతో స్థానిక గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

గజరాజుల దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.అలాగే ఇప్పటివరకు పలు పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి.

Advertisement

ఈ క్రమంలో ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు( Forest Officials ) స్పందించి ఏనుగుల బారి నుంచి తమను, తమ పంట పొలాలను కాపాడాలని కోరుతున్నారు.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు