తెలంగాణ లో ఎన్నికలు.. ఏపీలో భయం భయం.. కారణం ఇదే..!!

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ రెండు విడిపోయినప్పటికీ రెండు రాష్ట్రాల ప్రజలు అందరూ కలిసే ఉంటారు.

ఇక ఆంధ్రప్రదేశ్లో వర్షం వస్తే తెలంగాణలో చలి పెట్టినట్లు తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భయం పట్టుకుందట.

మరి తెలంగాణ ఎన్నికల (Telangana Elections) కు ఆంధ్రప్రదేశ్ నాయకులకు మధ్య ఉన్న సంబంధం ఏంటి.ఎందుకు తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఏపీ నాయకులు వణుకుతున్నారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగబోతుంది .అలాగే డిసెంబర్ 3న రిజల్ట్ రాబోతుంది.ఇక డిసెంబర్ 3న రాబోయే రిజల్ట్ కోసం చాలామంది తెలంగాణ ప్రజలతో పాటు ఏపీ రాజకీయ నాయకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.

దానికి కారణం తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వం మీదే ఆంధ్ర రాజకీయాలు ఆధారపడి ఉన్నాయని తెలుస్తోంది.

Elections In Telangana Fear In Ap This Is The Reason Details, Andhra Pradesh, Ap
Advertisement
Elections In Telangana Fear In AP This Is The Reason Details, Andhra Pradesh, Ap

ఇక తెలంగాణలో ఉండే చాలా మంది సెటిలర్లు, సరిహద్దు జిల్లాల్లో ఉండే ప్రజలు ఓట్లను తెలంగాణ ప్రభుత్వం ప్రభావితం చేసే అవకాశం ఉంది.ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో (AP Politics) ప్రస్తుతం టిడిపి పార్టీ ఎలాగైనా వైసీపీ పార్టీని( YCP ) పడగొట్టాలని చూస్తుంది.ఇక వైసిపి పార్టీ మరొక ఛాన్స్ ఇస్తే బాగుండు అని భావిస్తున్నారు.

ఇలాంటి తరుణంలో తెలంగాణ రాజకీయాల పై ఏపీ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి.ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తే వైసిపి పార్టీకి అనుకూలంగా ఉంటుంది.

Elections In Telangana Fear In Ap This Is The Reason Details, Andhra Pradesh, Ap

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే కచ్చితంగా టిడిపి జనసేన (TDP Janasena) పార్టీకి ఏపీలో అనుకూల వాతావరణం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేసుకుంటున్నారు.ఎందుకంటే తెలంగాణలో ఉండే సరిహద్దు జిల్లాల్లో ఉండే ఓటు బ్యాంకు ఏపీ రాజకీయాల్లో గెలిచే పార్టీ కి కీలకము.అందుకే తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో తమకి అనుకూలమైన పార్టీ గెలవాలి అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్ష అధికార పార్టీలు కోరుకుంటున్నాయట.

అయితే ఈ విషయం బయటికి చెప్పకపోయినప్పటికీ లోలోపల మాత్రం వైసిపి పార్టీ బీఆర్ఎస్ గెలవాలని,జనసేన టిడిపి పార్టీ కాంగ్రెస్ గెలవాలి అని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు