అమెరికాలో ఎన్నికల హీట్ రోజు రోజుకి పెరిగిపోతోంది.తమ పార్టీ అధికారంలోకి వస్తుందని డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే డెమోక్రాట్లు కొత్త నినాదం అందుకున్నారు.అందరికి విద్య , ఆరోగ్యం, ఉచిత యూనివర్సిటీ విద్య వంటివి తమ పదకాలని బల్లగుద్ది మరీ చెప్పారు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న బెర్నీ శాండర్స్
ఈ పధకాల అమలుకు ప్రజలపై పన్ను భారం పడుతుంది కదా మరి ప్రజలపై ఈ భారాన్ని వేస్తారా అనే ప్రశ్నకి బదులుగా ప్రతిపాదనల అమలు జరగాలంటే ప్రజలు పన్ను భారాన్ని భరించాల్సిందే అంటూ క్లారిటీ ఇచ్చారు.అమెరికాలో కొనసాగుతున్న అసమానతలు తీవ్రంగా ఖండించిన ఆయన ఆరోగ్య పరి రక్షణ మనిషి యొక్క ముఖ్యమైన హక్కని తెలిపారు.ఇదిలాఉంటే వివిధ ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్శిటీల నుంచీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు వంద మంది వైద్య ,విద్యా ప్రొఫెసర్లు, విద్యార్ధులపై ఉన్న దాదాపు 160 లక్షల కోట్ల డాలర్ల విద్యా రుణాన్ని మాఫీ చేయాలని చెప్పిన శాండర్స్ ప్రతిపాదనకి మద్దతు తెలిపారు.
ఇదే అమలు జరిగితే ఎంతో మంది విద్యార్ధులకి ఆర్ధిక భారం తగ్గినట్టేనని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంతో శాండర్స్ తో పాటు మరికొందరు డెమోక్రటిక్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy