Election Code Guidelines : ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే.. మార్గదర్శకాలు జారీ 

నేడు దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్( Election Code ) వెలువడనుంది.

లోక్ సభ ఎన్నికలతో పాటే,  ఏపీలోని నాలుగు రాష్ట్రాల ఎన్నికల కు సంబంధించి షెడ్యూల్ విడుదలవుతుంది .

ఎన్నికల షెడ్యూల్ విడుదలవగానే ఎన్నికల కోడ్( Election Code ) కూడా అమల్లోకి వస్తుంది .ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ? నిబంధనలు ఏమిటి అనే దానిపై ఏపీ ఎన్నికల కమిషన్( AP Election Commission ) మార్గదర్శకాలను విడుదల చేసింది.వాటి ప్రకారం చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రధాని ,సీఎం, మంత్రుల ఫోటోలను వెంటనే తొలగించాలని పేర్కొన్నారు.కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత 24 గంటల్లోగా ప్రభుత్వ ఆఫీసుల వద్ద రాజకీయ నాయకుల పోస్టర్లు, కటౌట్లు వెంటనే తొలగించాలని ,

రాజకీయ ప్రకటనలకు సంబంధించి హార్డింగ్ ,పోస్టర్లు , గోడ పైన రాతలను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.అలాగే బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లు, రోడ్లు , బస్సులు , విద్యుత్ స్తంభాలపైన ప్రకటనలను తొలగించాలని ఎన్నికల కమిషన్ పేర్కొంది.దీంతో పాటు ,పత్రికలు, టీవీల్లో ఇచ్చే ప్రభుత్వ పథకాల ప్రకటనలు కూడా వెంటనే నిలిపివేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది .ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే అన్ని ప్రభుత్వ వెబ్ సైట్ల నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధుల ఫోటోలను తొలగించాలని సూచించింది.

కోడ్ అమల్లోకి వస్తే మంత్రులకు ప్రభుత్వ అధికారిక వాహనాల వినియోగం వెంటనే నిలిపివేయాలని సూచించింది .ఎన్నికల ప్రక్రియలో ఉన్న అధికారులు, అధికార యంత్రాంగం బదిలీలపై పూర్తిగా నిషేధం అమల్లోకి వస్తుందని,  మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులకు పైలట్ కార్లు సైరన్ వినియోగించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.  అలాగే ప్రభుత్వ గెస్ట్ హౌస్ ల నుంచి మంత్రులు,  ప్రజాప్రతినిధులను వెంటనే ఖాళీ చేయించాలని సీఈవో ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతున్న నేపథ్యంలో అధికారులు దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు