ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

శని, ఆదివారాలు వచ్చాయంటే చాలు ఫ్రెండ్స్ తో పార్టీ, పబ్బులు అంటూ తెగ ఎంజాయ్ చేసేస్తుంటారు.

మండే వచ్చేసరికి హ్యాంగోవర్ ( Hangover )తో బెడ్ దిగడానికి కూడా గగనం అయిపోతుంటుంది.

అలసట, నీరసం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, వికారం, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ హ్యాంగోవర్ లక్షణాలు.చాలా మంది హ్యాంగోవర్ నుంచి బయటపడడానికి మందులు వాడుతుంటారు.

కానీ కొన్ని ఇంటి చిట్కాలతో ఈజీగా హ్యాంగోవర్ ను వదిలించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం ప‌దండి.

హ్యాంగోవర్ బారిన పడినప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.బాడీ ఎంత హైడ్రేటెడ్ గా ఉంటే హ్యాంగోవర్ ను అంత త్వరగా వదిలించుకోవచ్చు.

Advertisement
Effective Ways To Get Rid Of Hangover! Hangover, Hangover Symptoms, Hangover Rel

అసలు మద్యం తీసుకోవడానికి ముందు ఒకటి లేదా రెండు గ్లాసుల వాటర్ తీసుకుంటే హ్యాంగోవర్ సమస్యే ఉండదు.లెమన్ జింజర్ టీ.( Lemon Ginger Tea ) హ్యాంగోవర్ నుంచి బయటపడడానికి చాలా బాగా సహాయపడుతుంది.అందుకోసం ఒక గ్లాస్ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తరిగిన అల్లం ముక్కలు వేసి మరిగించాలి.

ఇలా మరిగించిన వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్‌ మిక్స్ చేసి తీసుకోవాలి.ఈ టీ తలనొప్పిని మరియు ఒళ్ళు నొప్పులను దూరం చేస్తుంది.

వాంతులు, వికారాన్ని తగ్గిస్తుంది.బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లోకి తెస్తుంది.

Effective Ways To Get Rid Of Hangover Hangover, Hangover Symptoms, Hangover Rel

అలాగే బ్లెండర్ తీసుకుని అందులో ఒక అరటిపండు, అరకప్పు పైనాపిల్ ముక్కలు, రెండు అల్లం స్లైసెస్, నాలుగు ఐస్ క్యూబ్స్, ఒక గ్లాస్ ఫ్రెష్ కొబ్బరి నీళ్లు ( Coconut Water )వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఈ బనానా పైనాపిల్ స్మూతీ హ్యాంగోవర్ ను నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.నీరసం అలసటను దూరం చేసి శరీరాన్ని ఎనర్జిటిక్ గా యాక్టివ్ గా మారుస్తుంది.

Effective Ways To Get Rid Of Hangover Hangover, Hangover Symptoms, Hangover Rel
చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

హ్యాంగోవర్ మంచి బయటపడడానికి ఫ్రూట్స్, నట్స్, టమాటో జ్యూస్, గుడ్డు, వోట్మీల్, కీర దోసకాయ వంటివి తీసుకోండి.వేడి వేడి నీటితో స్నానం చేయండి.అలాగే కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.

Advertisement

ఇవి హ్యాంగోవర్ నుంచి త్వరగా రికవరీ అయ్యేందుకు సహాయపడతాయి.

తాజా వార్తలు