పంటి నొప్పితో బాధపడుతున్నారా? అయితే క్షణాల్లో రిలీఫ్ పొందండిలా!

పంటి నొప్పి.చిన్న సమస్యగానే కనిపించిన భరించలేని నొప్పి, తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

దంత సంరక్షణ లేకపోవడం, బ్యాక్టీరియా, చిగుళ్ల వ్యాధి తదితర కారణాల వల్ల పంటి నొప్పి బాధ పెడుతూ ఉంటుంది.పంటి నొప్పి కారణంగా రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టదు.

చేసే పనిపై ఏకాగ్రత దెబ్బతింటుంది.ఈ క్రమంలోనే పంటి నొప్పిని వదిలించుకోవడం కోసం నానా పాట్లు ప‌డుతుంటారు.

అయితే పంటి నొప్పి నుంచి క్షణాల్లో రిలీఫ్ పొందటానికి ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు అద్భుతంగా సహాయపడతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో ఓ చూపు చూసేయండి.

Effective Tips To Prevent Toothache Are For You ,toothache, Toothache Relief Tip
Advertisement
Effective Tips To Prevent Toothache Are For You ,toothache, Toothache Relief Tip

వెల్లుల్లి..పంటి నొప్పిని తరిమి కొట్టడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించాలి.పొట్టు తొల‌గించిన వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచుకోవాలి.

ఇలా దంచి పెట్టుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని పంటి పై ఉంచుకోవాలి.వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మెండుగా ఉంటాయి.

అందువల్ల వెల్లుల్లి బ్యాక్టీరియాను నాశనం చేయడమే కాకుండా నొప్పి నివారణి గా పనిచేస్తుంది.అందువల్ల పంటి నొప్పితో తీవ్రంగా సతమతం అవుతున్న సమయంలో వెల్లుల్లితో సహజంగానే రిలీఫ్ ని పొందండి.

Effective Tips To Prevent Toothache Are For You ,toothache, Toothache Relief Tip
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

అలాగే పంటి నొప్పిని వదిలించడానికి పుదీనా సైతం సూపర్ పవర్ ఫుల్ గా పనిచేస్తుంది.అందుకోసం కొన్ని ఫ్రెష్ పుదీనా ఆకులను తీసుకుని వాట‌ర్ లో శుభ్రంగా క‌డిగి కచ్చాపచ్చాగా దంచుకోవాలి.ఇలా దంచుకున్న మిశ్రమాన్ని నొప్పి ఉన్న పంటిపై పెట్టండి.

Advertisement

లేదా ఐదు లేదా ఆరు ఫ్రెష్ పుదీనా ఆకులు నెమ్మదిగా నములుతూ తినండి.పుదీనాలో ఉండే ప్రత్యేక సుగుణాలు పంటి నొప్పిని సమర్థవంతంగా తగ్గిస్తాయి.

నిమిషాల్లో నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.పైగా పుదీనా ఆకులు నమలడం వల్ల బ్యాక్టీరియా నాశనం అవుతుంది.

చిగుళ్ల‌ సమస్యలు ఏమైనా ఉంటే దూరమవుతాయి.నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.

మరియు దంతాలు చిగుళ్లు ఆరోగ్యంగా మారతాయి.

తాజా వార్తలు