చిగుళ్ల నుంచి రక్తస్రావమా? అయితే ఇలా కట్టడి చేయండి!

చిగుళ్ల నుంచి రక్తస్రావం( Bleeding ) అనేది చాలా మంది సర్వ సాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి.

నోటి శుభ్రత లేకపోవడం, ఆహారపు అలవాట్లు, హార్మోన్ చేంజ్, ప‌లు రకాల మందుల వాడకం, కఠినమైన టూత్ బ్రష్ ను ఉపయోగించడం తదితర కారణాల వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంటుంది.

ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే చిగుళ్ల నష్టానికి దారి తీస్తుంది.దాంతో దంతాలు ఊడిపోవడం, నోటి ఆరోగ్యం దెబ్బతినడం వంటివి జరుగుతాయి.

అందుకే చిగుళ్ల నుంచి రక్తస్రావాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నించాలి.అయితే ఈ సమస్యకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ హోమ్ రెమెడీని పాటిస్తే చాలా సులభంగా సమస్యను పరిష్కరించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు( turmaric) వేసుకోవాలి.అలాగే పావు టేబుల్ స్పూన్ లవంగాల పొడి, పావు టేబుల్ స్పూన్ సాల్ట్( Salt ) వేసుకుని.

ఒక కప్పు గోరువెచ్చని నీరు పోసి బాగా కలిపి పది నిమిషాల పాటు వదిలేయాలి.

ఆ తర్వాత ఈ హెర్బల్ వాటర్( Herbal water ) ను నోటిలో పోసుకుని క‌నీసం ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు పుక్కలించాలి.ఆపై వాటర్ ను ఉమ్మేసి.నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా రోజుకు రెండు సార్లు అంటే ఉదయం, సాయంత్రం చేస్తే పసుపు మరియు లవంగాల్లో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్( Anti bacterial ) యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చిగుళ్ల నుంచి రక్తస్రావం స‌మ‌స్య‌ను అరిక‌డ‌తాయి.చిగుళ్లను ఆరోగ్యంగా బలంగా మారుస్తాయి.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

కాబట్టి చిగుళ్ల నుంచి రక్తస్రావం సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.పైగా ఈ హెర్బల్ వాటర్ తో రెగ్యులర్ గా మౌత్ వాష్ చేసుకోవడం వల్ల దంతాలు దృఢంగా మారతాయి.దంతాలపై ఎనామిల్ దెబ్బ తినకుండా ఉంటుంది.

Advertisement

నోటికి సంబంధించిన చాలా వరకు సమస్యల నుంచి సైతం ఉపశమనం పొందవచ్చు.

తాజా వార్తలు