జుట్టు ఎంత పల్చగా ఉన్నా వారానికి ఒక్కసారి ఇలా చేస్తే నెల రోజుల్లో ఒత్తుగా మారుతుంది!

సాధారణంగా కొందరి జుట్టు చాలా పల్చగా ఉంటుంది.రోజు ఊడే జుట్టు ఊడుతుంది.

కానీ కొత్త జుట్టు రాదు.దీని కారణంగానే కురులు పల్చగా( Thin Hair ) మారిపోతుంటాయి.

పల్చటి జుట్టుతో ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకోలేరు.అలాగే జుట్టు తోకలా ఉంటే చూపురులకు కూడా అంత ఆకర్షణీయంగా కనిపించదు.

ఈ క్రమంలోనే చాలామంది జుట్టును ( Hair ) మళ్ళీ ఒత్తుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.

Advertisement

వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే నెల రోజుల్లో ఒత్తుగా పెరగడం ప్రారంభం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం జుట్టును ఒత్తుగా( Thick Hair ) మార్చే ఆ హోమ్ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు,( Flax Seeds ) వన్ టేబుల్ స్పూన్ బియ్యం, వ‌న్‌ టేబుల్ స్పూన్ మెంతులు వేసి కనీసం ప‌ది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయం తో జెల్లీ స్ట్రక్చర్ లో ఉండే జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో అరకప్పు ఉల్లి రసం, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ గ్రోత్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.పల్చటి జుట్టు కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారుతుంది.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

అదే సమయంలో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.కురులు స్మూత్ అండ్ సిల్కీగా మెరుస్తాయి.

Advertisement

కాబట్టి పల్చటి జుట్టుతో బాధపడేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు