మొండి మెటిమలనైనా మాయం చేసే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్‌ మీకోసం!

పింపుల్స్( Pimples ).చాలా మందిని వేధించే కామన్ చర్మ సమస్య ఇది.

యుక్త వయసు ప్రారంభం అయినప్పటినుంచి మొటిమలు మొదలవుతాయి.వీటి కారణంగా కొందరు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.

మొటిమలతో నిండి ఉన్న ముఖాన్ని చూసుకోలేక మదన పడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే మొటిమల్లేని చర్మాన్ని పొందడానికి రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు.

మీరు ఈ లిస్టులో ఉన్నారా.అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీస్‌ మీకు చాలా ఎఫెక్టివ్ గా సహాయపడ‌తాయి.

Advertisement
Effective Home Remedies To Get Rid Of Stubborn Pimples! Stubborn Pimples, Pimple

మొండి మొటిమలనైనా మాయం చేస్తాయి.మరి ఇంతకీ ఆ ఎఫెక్టివ్ రెమెడీస్‌ ఏంటో తెలుసుకుందాం పదండి.

Effective Home Remedies To Get Rid Of Stubborn Pimples Stubborn Pimples, Pimple

రెమెడీ 1: మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు రెబ్బలు వేపాకు( Two neem leaves ) మరియు రెండు టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్( Rose water ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న వేపాకు మిశ్రమంలో పావు టీ స్పూన్ పసుపు( Turmaric ), వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వన్ టీ స్పూన్ ఫ్రెష్ పెరుగు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి కొంచెం మందంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.

ఆపై చల్లటి వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు.

ఈ రెమెడీ మొటిమలన్నిటినీ దూరం చేస్తుంది.వాటి తాలూకు గుర్తులను మాయం చేస్తుంది.

చిరంజీవి తర్వాత ఆ హీరోనే.... భవిష్యత్తులో చాలా గొప్పవాడు అవుతాడు : సునీల్ 
తులసి ఆకులను మగవారు రోజు తింటే ఆ సమస్య వస్తుందట..!

మొటమలు, మచ్చలు లేని చర్మాన్ని మీ సొంతం చేస్తుంది.

Effective Home Remedies To Get Rid Of Stubborn Pimples Stubborn Pimples, Pimple
Advertisement

రెమెడీ 2: మొటిమల నివారణకు మరొక రెమెడీ కూడా ఉంది.అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ ముల్తానీ మట్టి( Multani mitti ), వన్ టీ స్పూన్ వేపాకు పొడి, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ మరియు సరిపడా రోజ్‌ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.

పూర్తిగా డ్రై అయ్యాక వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని పాటించిన కూడా మొటిమల సమస్యను దూరం చేసుకోవచ్చు.

చర్మాన్ని అందంగా ప్రకాశవంతంగా మెరిపించుకోవచ్చు.

తాజా వార్తలు