నోటి దుర్వాసన సమస్యకు చెక్ పెట్టే ఎఫెక్టివ్ ఇంటి చిట్కాలు ఇవే!

నోటి దుర్వాసన.( Bad Breath ) చాలా మంది చాలా కామన్ గా ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి.

ఈ సమస్యతో బాధపడుతున్న వారు నలుగురితో కలవలేరు.మాట్లాడటానికి కూడా ఎంతో అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.

నోరు తెరిస్తే దుర్వాసన వస్తుందని తెగ భయపడుతుంటారు.ఎదుటివాళ్లు ఏమనుకుంటారో అని ఫీల్ అవుతుంటారు.

ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది మార్కెట్‌లో దొరికే మౌత్‌ ఫ్రెషనర్లను( Mouth Freshner ) వాడుతుంటారు.కానీ రసాయనాలతో నిండి ఉండే మౌత్ ఫ్రెషనర్లు వాడటం వల్ల పలు సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తే అవకాశాలు ఉంటాయి.అందుకే సహజంగానే ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి.

Advertisement

అందుకు ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలు అద్భుతంగా సహాయపడతాయి.

పుదీనా టీ.(Peppermint Tea ) నోటి దుర్వాసన సమస్యకు చెక్ పెట్టడానికి చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.రోజుకు ఒకటి లేదా రెండుసార్లు పుదీనా టీను తీసుకుంటే బ్యాడ్ బ్రీత్ కంట్రోల్ అవుతుంది.

అలాగే నోటి నుంచి దుర్వాసన వస్తుందని బాధపడుతున్న వారు ఏదైనా ఫుడ్ తిన్న వెంటనే మూడు లేదా నాలుగు పార్స్లీ ఆకులు నోట్లో వేసుకుని బాగా నమిలి తినాలి.ఇలా చేస్తే నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.

అలాగే కొన్ని కొన్ని పండ్లు బ్యాడ్‌ బ్రీత్ సమస్యను నివారించడానికి అద్భుతంగా సహాయపడతాయి.అటువంటి వాటిలో యాపిల్, పైనాపిల్, ఆరెంజ్ వంటివి ముందు వరసలో ఉన్నాయి.కాబ‌ట్టి, ఈ పండ్లను డైట్ లో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నించండి.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

యాలకులు( Elachi ) కూడా బ్యాడ్ బ్రీత్ను కంట్రోల్ చేస్తాయి.ఆహారం తీసుకున్న తర్వాత ఒక ఇలాచీ నోట్లో వేసుకుంటే చెడు వాసన రాకుండా ఉంటుంది.

Advertisement

ఇక ఒక గ్లాస్‌ గోరు వెచ్చని వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ) వేసి మిక్స్ చేసి.ఆ వాటర్ తో మౌత్ వాష్ చేసుకోవాలి.ఆపిల్ సైడర్ వెనిగర్ లేదు అనుకుంటే బేకింగ్ సోడాను కూడా వాడవచ్చు.

ఇలా రోజుకు ఒకటి లేదా రెండు సార్లు చేస్తే నోటి దుర్వాసన సమస్యకు దూరంగా ఉండవచ్చు.

తాజా వార్తలు