రామప్ప ఆలయానికి పొంచి ఉన్న ముప్పు.. ఎలాగంటే..

మన తెలంగాణ రాష్ట్రంలోని అపురూపమైన వరంగల్ రామప్ప ఆలయం మళ్లీ ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి.

అది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినందుకు ప్రతి తెలుగువాడు, అలాగే భారతీయుడు ఎంతో సంతోషించారు.

ఆ సంతోషాన్ని సింగరేణి కాలరీస్ ఓపెన్ కాస్టింగ్ పనులు ఆవిరి చేస్తున్నట్లు సమాచారం.కేంద్ర ప్రభుత్వం క్రింద పనిచేసే ఆర్కియా లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షణ నిర్వహణలో ఈ కట్టడం ఉంది.అది యాత్రికుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పొందడంలో చూపిస్తున్న శ్రద్ధ కట్టడా పరిరక్షణలో చూపించడం లేదు.2010లో కోస్టల్ కంపెనీ దేవాదుల సొరంగం తవ్వకాలు చేపట్టిన తరుణంలో అది పేల్చిన బాంబుల కారణంగా రామప్ప దేవాలయం గోడలు బీటలు వారిన విషయం తెలిసిందే.ఈ విధ్వంసాన్ని అతి విషాదకరంగా పలు పత్రికలు ప్రపంచవానికి వెల్లడి చేసిన ఏఎస్ఐ అంతగా ప్రతి స్పందించలేదని విమర్శలు కూడా వచ్చాయి.

దీనివల్ల కళాకారులు రచయితలు సామాజిక ఉద్యమకారులు ప్రజా సంఘాల వారు రామప్ప పరిరక్షణ కమిటీగా ఏర్పడి ఆందోళనలు కూడా చేశారు.ఆ తర్వాత మళ్లీ రామప్ప గుడి చుట్టూ 20 కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం, నల్లగొండ, పెద్దాపురం లాంటి గ్రామాల పరిధిలో ఓపెన్ కాస్ట్ తవ్వకాలు జరపడానికి సంవత్సరానికి మూడు పంటలు పండే పంట పొలాలను సర్వే చేసి స్వాధీనం చేసుకునే దిశగా సింగరేణి ఉండగా రామప్ప పరిరక్షణ కమిటీ రంగంలోకి దిగింది.

ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తెచ్చి సింగరేణి కంపెనీ అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు సద్దుమనిగెల చేశారు.అంతేకాకుండా సంవత్సరం క్రితం మళ్లీ ఓపెన్ కాస్ట్ తవ్వకాలు ప్రారంభం అవుతున్నాయని అనే వార్త తెరపైకి వచ్చింది.రామప్ప పరిరక్షణ కమిటీ ఇతర ప్రజా సంఘాలు తిరిగి ఆందోళన వ్యక్తం చేయడంతో సింగరేణి కంపెనీ యాజమాన్యం రామప్ప దేవాలయ పరిసరాల్లో ఓపెన్ కాస్ట్ చెయ్యమని మీడియా ముందు హామీ ఇచ్చింది.

Advertisement

అయితే మళ్లీ రామప్ప దేవాలయానికి ఓపెన్ ముప్పు రానుందని పరిసర గ్రామాల్లో సింగరేణి అధికారులు ఓపెన్ కాస్ట్ కు సంబంధించిన సర్వేలు చేస్తున్నారని విషయం బయటకు వచ్చింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్31, గురువారం 2024
Advertisement

తాజా వార్తలు