వయస్సు పెరిగినా కూడా యవ్వనంగా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే ఈ పరిశోధకులు..!

వయసు పెరగడం( Aging ) ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క జీవరాశిలో కచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది.

ముసలితనం అందరికీ శాపంగా, భయంగా అనిపిస్తూ ఉంటుంది.

అయితే ముసలితనాన్ని తప్పించుకునే దిశగా ప్రపంచవ్యాప్తంగా నిరంతరాయంగా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి.యవ్వనన్ని పొడిగించేందుకు సాగుతున్న ఈ పరిశోధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఒక బృందం ల్యాబ్ లో ఎలుక జీవితాన్ని 47 నెలల వరకు పొడిగించింది.ఇది ఇదివరకు రికార్డ్ చేసిన ఇతర ఎలుకల ఆయుష్షు కంటే 6 నెలలు ఎక్కువ అని పరిశోధకులు చెబుతున్నారు.

ఇలా ఆయుష్షు( Lifespan )పెంచేందుకు వయసు తక్కువగా ఉన్న ఎలుక నుంచి రక్తంలోని ప్లాస్మా ఇన్ఫ్యూజ్ చేసి ఈ ఫలితాలను పరిశోధకులు సాధించారు.వయస్సు పెరిగిన యవ్వనంగా ఉండాలని కోరుకునే వారు తప్పకుండా ఈ నాలుగు ప్రయోగాల గురించి తెలుసుకోవాలి.ముఖ్యంగా చెప్పాలంటే యువకుల నుంచి పెద్దవారికి రక్త మార్పిడి వంటి ప్రయోగాలు విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisement

ఈ ప్రక్రియ వ్యక్తి జీవితాన్ని పొడిగించడం కోసం కాదు.ఇది యవ్వనాన్ని పొడిగించేందుకు మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.

జీవితంలోని స్వర్ణ యుగం యవ్వనం( Young Age ) అని ఖచ్చితంగా చెప్పవచ్చు.ఈ కాలం మరింత ఎక్కువ కాలం పాటు ఉండేందుకు మరిన్ని ఆనందదాయక సంవత్సరాలను జోడించడానికి మాత్రమే చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే వృద్ధాప్యం వల్ల దెబ్బతిన్న కణాలు వయసు పెరిగిన ఛాయాలకు, వ్యాధులకు కారణమవుతాయి.

ముఖ్యంగా చెప్పాలంటే యూఎస్ లోని మిన్నెసోటాలో మయోక్లినిక్ మందులు( Mayo clinic Medicine ) వాడడం వల్ల ఎలుకల జీవితకాలం పెరిగినట్లు నిరూపించారు.ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఎడిన్ బర్గ్ యూనివర్సిటీ నిపుణులు వృద్ధాప్యానికి( Old Age ) కారణమయ్యే సెనెసెంట్ కణాలను ఎదుర్కోగల మూడు కాంపౌండ్స్ ను గుర్తించారు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

ఇలా రకరకాల ప్రయోగాలు మనల్ని యవ్వనంగా ఉంచేందుకు కొనసాగుతున్నాయి.ఈ పరిశోధనలలో ఒకటి విజయం సాధించిన అద్భుతమే జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు