నటుడు ప్రకాష్ రాజ్ కి ఈడీ నోటీసులు..!!

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్( Prakash Raj ) అందరికీ సుపరిచితుడే.నటుడిగా దేశవ్యాప్తంగా ఆయనకంటూ మంచి గుర్తింపు ఉంది.

ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సమాజంలో అనేక అంశాలపై ప్రభుత్వాలను ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో ప్రశ్నిస్తూ ఉంటారు.ఈ క్రమంలో కొన్ని ఘటనాలకు సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో.

చాలాసార్లు వైరం పెట్టుకోవడం జరిగింది.దీంతో బీజేపీ నాయకులు( BJP ) కూడా ప్రకాష్ రాజ్ పై అనేక విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈడీ పోంజీ పథకం కేసులో ప్రకాష్ రాజ్ కి నోటీసులు జారీ చేయడం జరిగింది.విషయంలోకి వెళ్తే తమిళనాడు తిరుచునాపల్లికి చెందిన ప్రణవ్ జ్యువెలర్స్(Pranav Jewellers ) కి ప్రకాష్ రాజ్ అంబాసిడర్ గా వ్యవహరించడం జరిగింది.

Advertisement

అయితే ఈ సంస్థ పోంజీ స్కీమ్ ద్వారా ప్రజల వద్ద నుండి దాదాపు 100 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగిందట.ఆ తర్వాత అక్టోబర్ నెలలో బోర్డు తిప్పేయడం జరిగింది.

ప్రణబ్ జ్యువెలర్స్ నమ్మించి మోసం చేసిందని ఫెడరల్ ఏజెన్సీ బుధవారం ఓ ప్రకటనలో తెలియజేసింది.దీంతో ఓనర్ మదన్ పై కేసు నమోదు కావడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా తమిళనాడు పోలీసుల ఆర్థిక నేరాల విభాగానికి చెందిన ఎఫ్ఐఆర్ ఆధారం చేసుకుని ఈడీ చర్యలకు దిగింది.100 కోట్ల మేర మోసం జరిగిందని ఈడీ గుర్తించి.కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరుకావాలని ప్రకాష్ రాజ్ కి నోటీసులు జారీ చేయడం జరిగింది.

వచ్చే వారం చెన్నైలోని ఈడీ ఎదుట హాజరుకావాలని ఆదేశాలలో స్పష్టం చేయడం జరిగింది.

గేమ్ చేంజర్ లేట్ అయిన రామ్ చరణ్ కామ్ గా ఉండటానికి కారణం ఇదేనా..?
Advertisement

తాజా వార్తలు