JC Prabhakar Reddy: ఈడీ విచారణ చేయడం నాకు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశం.. జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు ఈడీ అటాచ్ చేసిన నేపథ్యంలో ఆయన సంచలన కామెంట్స్ చేశారు.

ఇప్పుడే కేసు అసలైన రూట్ లో వెళ్తోందని.

ఇందులో అందరూ ఇరుక్కుని.నేను నిర్దోషిగా బయటకు వస్తానన్నారు.

ఈడీ విచారణ చేయడం నాకు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశంగా అభిప్రాయపడ్డారు.అందుకే నాకు ఈడీ దేవుడు లాంటిదన్నారు.

ఇందులో ముందుగా తనకు వాహనాలు అమ్మిన అశోక్ లైలాండ్ ను ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు.కాస్త ఆలస్యంగా నైనా అశోక్ లైలాండ్ వారిని ఇందులో చేర్చడం సంతోషమన్నారు.

Advertisement

ఇందులో నాగాలాండ్ అధికారులు, పోలీసులు, ఆర్టీఓ అధికారులు అందరూ ఇరుక్కుంటారని జేసీ అన్నారు.ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తనకు సంతోషించదగ్గ పరిణామం అన్నారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు