తెలంగాణ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులపై ఈసీ ఆరా..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై ఎన్నికల సంఘం ఆరా తీసింది.

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వివరాలు తెలుసుకున్నారు.

పలుచోట్ల జరిగిన ఘర్షణలపై రాష్ట్ర డీజీపీతో మాట్లాడారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని డీజీపీకి సీఈవో వికాస్ రాజ్ సూచించారు.

మరోవైపు కొన్ని ప్రాంతాల మినహా రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ కొనసాగనుంది.

బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ ‘వాక్యం’ చెప్పుకుంటూ జనాలని ‘గొర్రెల కాపరి దారి’లో నడిపించడమే మేలు?
Advertisement

తాజా వార్తలు