బ్రేక్‌ ఫాస్ట్‌లో ఈ ప్రోటీన్ దోసె తింటే రోజంతా ఉల్లాస‌మే!

రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాల‌న్నా.బ‌రువు అదుపులోకి రావాల‌న్నా.

అతి ఆక‌లి దూరం కావాల‌న్నా.

మెద‌డు, గుండె వంటి అవ‌య‌వాలు స‌క్ర‌మంగా ప‌ని చేయాలాన్నా.

శ‌రీరానికి ప్రోటీన్ ఎంతో అవ‌స‌రం.అందుకే ఫ‌స్ట్ మీల్ లో ప్రోటీన్ పుష్క‌లంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాల‌ని వైద్య నిపుణులు చెబుతుంటారు.

ఫ‌స్ట్ మీల్ అంటే బ్రేక్ ఫాస్ట్‌.చాలా మంది క‌డుపును నింపుకోవ‌డం కోసం బ్రేక్ ఫాస్ట్ లో ఏది ప‌డితే అది తినేస్తూ ఆరోగ్యాన్ని రిస్క్ లో ప‌డేస్తుంటారు.కొంద‌రైతే కంప్లీట్ గా బ్రేక్ ఫాస్ట్‌నే స్కిప్ చేస్తుంటారు.

Advertisement

ఇది అంత‌కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది.బ్రేక్ ఫాస్ట్ ను పొర‌పాటున కూడా స్కిప్ చేయ‌రాదు.

అలాగే బ్రేక్ ఫాస్ట్ లో ఏది ప‌డితే అది తిన‌డం కాకుండా ఇప్పుడు చెప్ప‌బోయే ప్రోటీన్ దోసెను తీసుకుంటే రోజంతా ఉల్లాసంగా ఉంటారు.మ‌రియు ఆరోగ్యానికి బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాలు సైతం ల‌భిస్తాయి.

ఇక ప్రోటీన్ దోసె అంటే మీరు పెద్ద‌గా ఏమీ క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం కూడా ఏమీ లేదు.దాని కోసం నైట్ నిద్రించే ముందు ఒక క‌ప్పు మిన‌ప‌ప్పు, ఒక క‌ప్పు పెస‌ర‌ప‌ప్పు వాట‌ర్‌లో నాన‌బెట్టుకోవాలి.

ఉద‌యాన్నే నాన‌బెట్టుకున్న మిన‌ప‌ప్పు, పెస‌ర‌ప‌ప్పుల‌ను బాగా క‌డిగి మిక్సీ జార్‌లో వేసుకోవాలి.అలాగే రుచికి స‌రిప‌డా ఉప్పు, రెండు గ్రీన్ చిల్లీస్, స‌రిప‌డా వాట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

ఇప్పుడు ఈ పిండిలో రెండు టేబుల్ స్పూన్ల గోధ‌మ పిండి, రెండు టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడ‌ర్‌, అర స్పూన్ జీల‌క‌ర్ర‌, రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము, స‌న్న‌గా త‌రిగిన పాల‌కూర వేసుకుని వాట‌ర్ సాయంతో బాగా క‌లుపుకోవాలి.

Advertisement

ఇక ఈ పిండితో దోసె వేసుకుంటే.అదే ప్రోటీన్ దోసె.సూప‌ర్ టేస్టీగా ఉండే ఈ ప్రోటీన్ దోసెను బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకోవ‌డం వ‌ల్ల రోజంతా ఉల్లాసంగా ఉండేందుకు కావాల్సిన శ‌క్తి శ‌రీరానికి ల‌భిస్తుంది.

అతి ఆక‌లి అన్న స‌మ‌స్యే ఉండ‌దు.వెయిట్ లాస్ అవుతారు.శ‌రీరానికి కావాల్సిన ప్రోటీన్‌తో పాటు మ‌రెన్నో పోష‌కాలు సైతం ల‌భిస్తాయి.

తాజా వార్తలు